24 గంటలు దాటినా దొరకని.. చందానగర్‌ బాలుడి ఆచూకీ

13years old boy missing in Hyderabad's chandanagar. హైదరాబాద్‌లోని చందానగర్‌లో అదృశ్యమైన 13 ఏళ్ల బాలుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నిన్న ఉదయం సమయంలో బాలుడు

By అంజి  Published on  9 Nov 2021 2:33 PM IST
24 గంటలు దాటినా దొరకని.. చందానగర్‌ బాలుడి ఆచూకీ

హైదరాబాద్‌లోని చందానగర్‌లో అదృశ్యమైన 13 ఏళ్ల బాలుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నిన్న ఉదయం సమయంలో బాలుడు అక్షిత్‌ మిస్‌ అయ్యాడు. అక్షిత్‌ అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24 గంటలు గడిచినా కొడుకు జాడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. ఇక బాలుడీ ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు ముమ్ముర గాలింపు చేపట్టారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాలుడి తల్లిదండ్రులకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? లేదా కావాలనే కిడ్నాప్‌ చేశారా.. బాలుడే ఎక్కడికైనా వెళ్లాడా? అన్న కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్షిత్‌ మిస్సింగ్‌పై అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బాలుడు అక్షిత్‌ ఆచూకీ కోసం ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసును చాలా సీరియస్‌ తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story