షాకింగ్.. మృత శిశువుకు జన్మనిచ్చి మరణించిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలు

రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on  26 Dec 2024 8:16 PM IST
షాకింగ్.. మృత శిశువుకు జన్మనిచ్చి మరణించిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలు

రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం.. ఎనిమిది నెలల క్రితం 13 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇప్పుడు అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాలిక మృత శిశువుకు జన్మనిచ్చి మరణించింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. దీంతో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. బాలిక మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడిపై ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

మంగళవారం నాడు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బాలికను దుంగార్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించామని, విచారణలో ఆమె ఎనిమిది నెలల గర్భిణి అని తేలిందనిజ‌జ‌ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హరేంద్ర సింగ్ దీని గురించి సమాచారం ఇచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో బాలిక నెలలు నిండకుండానే ఆడపిల్లకు జన్మనిచ్చిందని.. అయితే ఆ శిశువు చనిపోయి ఉంద‌ని, అరగంట తరువాత అత్యాచార బాధితురాలు కూడా చనిపోయిందని ఆ పోలీసు అధికారి చెప్పాడు.

ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారని, అనంతరం ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారాన్ని సేకరించిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ హరేంద్ర సింగ్ తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Next Story