ఆలయం నుండి వస్తున్న 13 ఏళ్ల‌ బాలికపై గ్యాంగ్ రేప్‌

13-year-old girl returning from temple abducted. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఆలయం నుండి 13 ఏళ్ల బాలిక తిరిగి వస్తుండగా ఆమెను..

By Medi Samrat  Published on  24 Jan 2022 10:18 AM GMT
ఆలయం నుండి వస్తున్న 13 ఏళ్ల‌ బాలికపై గ్యాంగ్ రేప్‌

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఆలయం నుండి 13 ఏళ్ల బాలిక తిరిగి వస్తుండగా ఆమెను.. కిడ్నాప్ చేసి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో, నలుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. నివేదికల ప్రకారం.. 13 ఏళ్ల బాలిక ఆలయానికి చేరుకోవడానికి ప్రతిరోజూ వెళ్లే మార్గం నుండి అపహరించారు. ఆ తరువాత ఆమె లైంగిక వేధింపులకు గురైంది. ఆమె గుడి నుంచి తిరిగి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు బాలికను గుర్తించారు. వారు ఆమెను వెంబడించడం ప్రారంభించారు.

నిందితులు బాలిక గొంతు బిగించి, సమీపంలోని పొలానికి బలవంతంగా తీసుకెళ్లారు. పొలంలో ఆమెపై లైంగిక దాడి చేసి పారిపోయారు. ఆ తర్వాత మైనర్ ఇంటికి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించింది. అప్పటికి కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమె రోడ్డుపై వస్తూ ఉండడం గమనించారు. ఆమె శరీరం నిండా గాయాలున్నాయి. బాలిక తల్లిదండ్రులు జరిగిన నేరంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నలుగురు నిందితులు దీపక్ నిషాద్ (27), సూరజ్ సూర్యవంశీ (21), సూరజ్ యాదవ్ (20), మహేష్ పాసి (19)లను అరెస్టు చేశారు. భారతీయ శిక్షాస్మృతి మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం వారిపై కేసు నమోదు చేయబడింది.

పూణె జిల్లాలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో 13 ఏళ్ల బాలికపై 21 ఏళ్ల కార్మికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మైనర్‌ తల్లిదండ్రులు కూలీకి వెళ్లడంతో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె నివాసంలోకి చొరబడ్డ నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. భారతీయ శిక్షాస్మృతి లోని వివిధ నిబంధనల ప్రకారం అతనిపై కేసు నమోదు చేయబడింది.


Next Story
Share it