మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని గిరిజన విద్యార్థుల పాఠశాల హాస్టల్‌లో ఓ బాలుడు చనిపోయాడు. 13 ఏళ్ల బాలుడు శవమై కనిపించాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆదర్శ్ కొంగే అనే బాలుడు విద్యాభారతి హైస్కూల్ విద్యార్థి. పాఠశాల హాస్టల్‌లో ఉంటున్నాడని అధికారులు తెలిపారు. హాస్టల్ సిబ్బంది పలుమార్లు ప్రయత్నించినప్పటికీ బాలుడు ఉదయం నిద్ర లేవకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు అమరావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కొడుకు తన స్నేహితుల్లో కొందరితో గొడవ పడ్డాడని, వారే అతడిని హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించామని, విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.