ఏడో క్లాస్ చదువుతున్న బాలిక ప్రెగ్నెంట్.. కారణమైన వ్యక్తి ఎవరో తెలిసి విస్తుపోయారు..!

12-year-old girl raped by minor when she became pregnant. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్ పారిశ్రామిక వాడలో 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిన కేసు

By Medi Samrat  Published on  17 Nov 2021 4:46 PM IST
ఏడో క్లాస్ చదువుతున్న బాలిక ప్రెగ్నెంట్.. కారణమైన వ్యక్తి ఎవరో తెలిసి విస్తుపోయారు..!

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్ పారిశ్రామిక వాడలో 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిన కేసు వెలుగులోకి వచ్చింది. ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తి ఓ మైనర్ అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. బాలికపై ప్రతిరోజూ అత్యాచారం జరుగుతూ వచ్చింది.. ఫలితంగా ఆమె మూడు నెలల గర్భవతి అని తెలుస్తోంది. బాలికకు అబార్షన్ మాత్ర ఇవ్వడంతో ఆమె మింగేసింది. దీంతో కడుపు నొప్పి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. స్థానిక వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక మూడు నెలల గర్భిణి అని అబార్షన్ మందులు వాడిందని తెలియడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆమె గర్భవతి అవ్వడానికి కారణమైన బాలుడు ఇండోర్ పారిపోయాడు.

ఆ విద్యార్థినిపై అత్యాచారం చేసిన యువకుడిపై ఫిర్యాదు నమోదైంది. నిందితుడు బాలికను కారులో దింపుతానని ప్రలోభపెట్టి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఆ తర్వాత విద్యార్థినిని బెదిరించి నోరుమూయించారు. విద్యార్థిని గర్భవతి అయిన తర్వాత, నిందితుడు ఆమెకు మూడు రోజుల ముందు అబార్షన్ మాత్ర ఇవ్వడంతో కడుపు నొప్పితో ఆమె విలవిలలాడింది. ఆసుపత్రికి తీసుకుని వెళ్ళినప్పుడు మాత్రమే ఆమె గర్భవతి అనే నిజం కుటుంబ సభ్యులకు తెలిసింది.

గణపతి ప్రాంతంలోని పాఠశాలకు చెందిన విద్యార్థి మూడు నెలల క్రితం ఆమె పాఠశాల నుండి బయలుదేరినప్పుడు బాధితురాలిని మాటల్లో దించి పల్హార్ నగర్ వాటర్ ట్యాంక్ వద్దకు తీసుకొచ్చి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు. ఆ తర్వాత కూడా బాధితురాలితో పలుమార్లు కలిశాడని... ఈ విషయాన్ని బాలిక కూడా ఎవరికీ చెప్పలేదని పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు.


Next Story