తండ్రిని దారుణంగా చంపిన కూతురు.. కేవలం దాని కోసమే..!

12 year old girl brutally killed her father. బ్రెజిల్‌లో షాకింగ్‌ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ 12 ఏళ్ల బాలిక తన తండ్రిని దారుణంగా హత్య చేసింది. బాలిక తన 13 ఏళ్ల

By అంజి  Published on  24 Oct 2021 11:23 AM GMT
తండ్రిని దారుణంగా చంపిన కూతురు.. కేవలం దాని కోసమే..!

బ్రెజిల్‌లో షాకింగ్‌ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ 12 ఏళ్ల బాలిక తన తండ్రిని దారుణంగా హత్య చేసింది. బాలిక తన 13 ఏళ్ల స్నేహితురాలితో కలిసి తండ్రిని దారుణంగా చంపివేసింది. నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక అసలు కారణం బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో జరిగింది. మృతుడు నీఫ్‌ లూయిజ్‌ వెర్లాంగ్‌(46) ఒక పోలీసు అధికారి. హత్య వెనుక కారణం తెలుసుకున్న తర్వాత, పిల్లలను కొన్ని విషయాల్లో దూరంగా ఉంచడం మంచిదని మీరు కూడా చెబుతారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫేమస్‌ కావడం కోసమే తండ్రిని బాలిక హత్య చేసింది. 2002లో జరిగిన ఓ హత్య కేసు నుంచి స్పూర్తి పొందిన ఆ బాలిక.. అప్పటి నుంచి కిల్లర్ గర్ల్‌గా వార్తల్లో నిలిచేందుకు తండ్రిని హత్య చేసింది.

డెయిలీ స్టార్‌ అనే వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. బ్రెజిల్‌లో 20 ఏళ్ల క్రితం సుసాన్‌ లూయిస్‌ అనే అమ్మాయి తన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసింది. సుసాన్‌ స్కూల్‌ స్టడీ చేస్తున్న సమయంలో తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ షాకింగ్‌ హత్య తర్వాత సుసాన్‌ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. నీఫ్‌ కుమార్తె ఈ కేసు గురించి విన్నప్పుడు.. తాను కూడా సుసాన్‌ వలె ఫేమస్‌ కావాలని నిర్ణయించుకుంది. నిందితులకు తాము తప్పు చేశామన్న పశ్చాత్తాపం ఏమాత్రం లేదని పోలీసులు తెలిపారు. ఇద్దరు బాలికలు కూడా తమ స్టేట్‌మెంట్‌లో.. ఫేమస్‌ కావాలని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు. ఇది విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరు అమ్మాయిలు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it