దారుణం : 11 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం

11-year-old girl raped in Uttar Pradesh's Amethi district. ప్ర‌భుత్వాలు ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికీ దేశంలో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు

By Medi Samrat  Published on  26 Nov 2021 2:31 PM IST
దారుణం : 11 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం

ప్ర‌భుత్వాలు ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికీ దేశంలో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు మాత్రం ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో 11 ఏళ్ల బాలికపై దారుణానికి ఒడిగ‌ట్టాడు ఓ కామాంధుడు. బాలిక గ్రామానికే చెందిన ఓ 20 ఏళ్ల‌ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. మంగళవారం బాలిక మేకలను పొలంలో మేపేందుకు తీసుకెళ్లింది. ఆ స‌మ‌యంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

బాలిక‌ తల్లి యువకుడిపై ఫిర్యాదు చేసిందని.. ఈ విషయమై విచారణ జరుగుతోందని అమేథి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అర్పిత్ కపూర్ తెలిపారు. బాధిత బాలిక‌ తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. మేక‌లు మేపేందుకు వెళ్లిన‌ బాలిక ఇంటికి చేరుకోగానే స్పృహ తప్పి పడిపోయిందని.. దీంతో చికిత్సకై ప్రతాప్‌గఢ్‌లోని జిల్లా ఆసుపత్రికి త‌ర‌లించామ‌ని.. తన కూతురు స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని తనతో చెప్పిందని బాలిక తల్లి తెలిపింద‌ని పోలీసులు పేర్కొన్నారు.


Next Story