సిమెంట్ మిక్సర్ వాహ‌నాన్ని ఢీ కొట్టిన వ్యాన్‌.. 11 మంది స్పాట్ డెడ్‌

మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By -  Medi Samrat
Published on : 13 April 2026 2:24 PM IST

సిమెంట్ మిక్సర్ వాహ‌నాన్ని ఢీ కొట్టిన వ్యాన్‌.. 11 మంది స్పాట్ డెడ్‌

మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నివేదికల ప్రకారం.. ఒక వ్యాన్ సిమెంట్ మిక్సర్‌ను ఢీకొనడంతో 11 మంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ముర్బాద్‌లోని గోవిలి గ్రామంలోని రైతా వంతెనపై ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, ఒక వ్యాన్ ఎదురుగా వస్తున్న సిమెంట్ మిక్సర్‌ను ఢీకొట్టింది. ఈ ధాటికి వ్యాన్‌లో ఉన్న 11 మంది అక్కడికక్కడే మరణించారు.

ప్రమాద స్థలంలో పోలీసులు సహాయక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దానిని క్లియర్ చేయడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, సహాయక బృందాలు, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడం, మృతదేహాలను వెలికితీయడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

Next Story