బర్త్ డే కేక్ తిని.. ప్రాణాలు వదిలిన 10 సంవత్సరాల బాలిక

పంజాబ్‌లోని పాటియాలాలో పదేళ్ల బాలిక తన పుట్టినరోజు కేక్ తిన్న తర్వాత ఊహించని విధంగా చనిపోయింది.

By Medi Samrat  Published on  31 March 2024 4:54 PM IST
బర్త్ డే కేక్ తిని.. ప్రాణాలు వదిలిన 10 సంవత్సరాల బాలిక

పంజాబ్‌లోని పాటియాలాలో పదేళ్ల బాలిక తన పుట్టినరోజు కేక్ తిన్న తర్వాత ఊహించని విధంగా చనిపోయింది. ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక మాన్వి, ఆమె సోదరి తన పుట్టినరోజును జరుపుకుంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కేక్‌ను తిన్న తర్వాత ఆమె రాత్రి అస్వస్థతకు గురైంది.

పుట్టినరోజు వేడుకల వీడియోలో బాలికకు ఆమె కుటుంబ సభ్యులు కేక్ తినిపిస్తున్నట్లు చూపించారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బాలిక వాంతులు చేసుకోవడంతో.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో మాన్వి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కేక్ తిన్న ఆమె చెల్లెలు ప్రాణాలు నిలబడ్డాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మాన్వి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేక్ తయారు చేసిన వారిపై ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు కోరుతున్నారు. కేక్ ఎక్కడి నుండి తీసుకుని వచ్చారనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story