ఛత్తీస్‌గఢ్‌లోని గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో భవనం మొత్తం కూలిపోయింది.దీంతో ఎంతో మంది కార్మికులు శిథిలాల కింద సమాధి అయ్యారు. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మరణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పోలీసులు, అగ్నిమాపక దళం, అంబులెన్స్లు సంఘటనా స్థలానికి చేరుకుని.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలోని ఒక ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది, ఆ ప్రాంతమంతా భారీ శబ్దం ప్రతిధ్వనించింది. సమీపంలోని ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు. ఇక స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్‌లకు సమాచారం అందించాయి. ఇరుక్కున్న వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన అనేక మంది వ్యక్తులను రాయ్‌పూర్‌లోని మెహకారా ఆసుపత్రికి తరలించారు. బెమెతర కలెక్టర్, ఇతర అధికారులు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.