తల్లిని వేధించిన వ్య‌క్తికి 10 రోజుల జైలు శిక్ష

సికింద్రాబాద్‌లోని భోలక్‌పూర్‌లో సొంత తల్లిపై దాడి చేసినందుకు నాచారం తారకరామారావు అనే 40 ఏళ్ల వ్యక్తికి సికింద్రాబాద్‌లోని స్థానిక కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది.

By -  Medi Samrat
Published on : 20 Sept 2025 4:48 PM IST

తల్లిని వేధించిన వ్య‌క్తికి 10 రోజుల జైలు శిక్ష

సికింద్రాబాద్‌లోని భోలక్‌పూర్‌లో సొంత తల్లిపై దాడి చేసినందుకు నాచారం తారకరామారావు అనే 40 ఏళ్ల వ్యక్తికి సికింద్రాబాద్‌లోని స్థానిక కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. రావు తాగిన మత్తులో ఇంటికి తిరిగి వచ్చి తన తల్లిని వేధించేవాడు. మద్యం సేవించవద్దని, కెరీర్‌పై దృష్టి పెట్టమని తల్లి కోరినప్పటికీ తారకరామారావు ఊరుకోలేదు. ఎటువంటి కారణం లేకుండా తన తల్లిని హింసించడం, కొట్టడం కొనసాగించాడు.

అతని చిత్రహింసలు భరించలేక ఆమె గాంధీ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి కొన్ని రోజుల క్రితం రావుపై కేసు నమోదు చేశారు. తాగిన మత్తులో తన తల్లిని వేధించడమే కాకుండా, ఆ ప్రాంతంలో ఇబ్బందులు కలిగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. భోలక్‌పూర్ నివాసితులు రావు వేధింపుల గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయినా కూడా మారకుండా తన తల్లిపై దాడి చేయడం ప్రారంభించడంతో, పోలీసులు రావుపై కొత్త కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 10 రోజుల జైలు శిక్ష విధించింది.

Next Story