లోయలో పడిన బస్సు.. ఇంజినీరింగ్ విద్యార్థి మృతి.. 40 మందికి గాయాలు

1 student killed, 40 others injured as bus falls into gorge in Kerala. కేరళలోని ఇడుక్కిలో టూరిస్ట్ బస్సు లోయలో పడిన ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా

By Medi Samrat  Published on  1 Jan 2023 10:07 AM IST
లోయలో పడిన బస్సు.. ఇంజినీరింగ్ విద్యార్థి మృతి.. 40 మందికి గాయాలు

కేరళలోని ఇడుక్కిలో టూరిస్ట్ బస్సు లోయలో పడిన ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. తిరువనంతపురం నుండి 320 కిలోమీటర్ల దూరంలోని తిరుర్‌లోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తమ స్టడీ టూర్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అటవీ ప్రాంతంలో బస్సు బోల్తా పడింది. పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సు అదుపు తప్పి లోయలో పడిన‌ట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం ప‌లుకుతున్న‌ సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. కేరళలో పలు ప్రాంతాల్లో నూత‌న సంవ‌త్స‌ర వేడుకలు ఘ‌నంగా జరిగాయి.




Next Story