రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

1 dead, two injured after fire breaks out in Mumbai's Ghatkopar. ముంబైలోని ఘట్‌కోపర్ ప్రాంతంలోని పరాఖ్ హాస్పిటల్ సమీపంలోని జూనోస్ పిజ్జా రెస్టారెంట్‌లో

By Medi Samrat
Published on : 17 Dec 2022 5:34 PM IST

రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

ముంబైలోని ఘట్‌కోపర్ ప్రాంతంలోని పరాఖ్ హాస్పిటల్ సమీపంలోని జూనోస్ పిజ్జా రెస్టారెంట్‌లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ముంబై ఫైర్ సర్వీస్ ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకు మంటలు సంభవించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఐదు ఫైరింజన్లను పంపించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పరాఖ్ ఆసుపత్రి సమీపంలోని విశ్వాస్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న జూనోస్ పిజ్జా హోటల్‌లోని ఎలక్ట్రిక్ మీటర్ గదిలో మంటలు చెలరేగాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని రాజవాడి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఖుర్షీ దేధియా (46) అనే వ్యక్తి మరణించినట్లు ప్రకటించారు.

మరో ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారిలో తానియా కాంబ్లే (18) అనే వ్యక్తికి అగ్నిప్రమాదంలో 20 శాతంకు పైగా కాలిన గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన‌ మరో మహిళను.. 20 ఏళ్ల కుల్సుమ్ షేక్ గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది అని రాజావాడి హాప్సిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. అగ్నిప్రమాదం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంద‌ని ఫిర్యాదు చేయడంతో పరాఖ్ ఆసుపత్రిలో చేరిన 22 మంది రోగులను మరొక ఆసుపత్రికి తరలించారు.



Next Story