విజయవాడలో రెచ్చిపోయిన కాల్‌నాగులు..
By అంజి Published on 29 Dec 2019 1:42 PM ISTముఖ్యాంశాలు
- వడ్డీ రాక్షసుల వేధింపులకు ప్రేమ్ అనే వ్యక్తి ఆత్మహత్య
- కాలువలో దూకి ప్రేమ్ ఆత్మహత్య
- నలుగురికి కఠినంగా శిక్షించాలని సెల్ఫీ వీడియో
విజయవాడలో మరోసారి కాల్‌మనీ కలకలం రేపింది. మరోకరి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కాల్‌మనీ వ్యాపారుల వేధింపులు తాళలేక ప్రేమ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తుపాకుల మహేష్ అనే వ్యక్తులు కారణమంటూ ప్రేమ్ సెల్ఫీ వీడియో తీశాడు. అసలు కేవలం రూ.4 లక్షలనేనని వడ్డీ 16 లక్షలు కట్టిన వ్యాపారులు తీవ్ర వేధింపులకు గురి చేశారని వీడియోలో ప్రేమ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా వడ్డీ చెల్లించాలంటూ పీడించారని వీడియోలో పేర్కొన్నాడు. అంతకుముందు కాల్‌మనీ విషయమై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశానని.. పోలీసులు పట్టించుకోలేదని ప్రేమ్ ఆరోపించాడు.
నలుగురికి కఠినంగా శిక్షించాలని.. కులం పేరుతో దూషించారని చనిపోయే ముందు తన బాధను వీడియోలో వెళ్లగక్కాడు. అనంతరం కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్‌మనీ వ్యాపారులు ఇంటికి వెళ్లి కూడా ప్రేమ్ కుటుంబ సభ్యులను వేధించినట్టు తెలుస్తోంది. ఇంటి వద్ద గొడవ పెడుతూ కాల్‌మనీ వ్యాపారులు భయభ్రాంతులకు గురి చేశారని సమాచారం. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ్ సెల్ఫీ వీడియోను పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తన భర్త ఆత్మహత్యకు కారణమైన నలుగురు కాల్‌మనీ వ్యాపారులను కఠినంగా శిక్షించాలని ప్రేమ్ భార్య డిమాండ్ చేస్తున్నారు.