నదిలో దూకిన యువతి.. కాపాడిన పోలీసు..!

By అంజి  Published on  8 Dec 2019 6:08 AM GMT
నదిలో దూకిన యువతి.. కాపాడిన పోలీసు..!

కృష్ణా జిల్లా అవనిగడ్డలో డిగ్రీ విద్యార్థిని కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. పులిగడ్డ-పెనుముడి బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి దగ్గరల్లోనే అవనిగడ్డ పోలీసులు నో యాక్సిడెంట్‌ డే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యువతి నదిలోకి దూకిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటినా పోలీసులు సంఘటనా స్థలాని చేరుకున్నారు. నదిలో దూకిన యువతిని అవనిగడ్డ ఏఎస్సై మాణిక్యాలరావు, కానిస్టేబుల్‌ గోపిరాజు రక్షించారు. యువతిని వెంటనే అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఏఎస్సై మాణిక్యాలరావును, గోపిరాజును పోలీసులు ఉన్నతాధికారులు, స్థానిక ప్రజలు అభినందించారు. ఏఎస్సై మాణిక్యాలరావు త్వరలో రిటైర్మెంట్‌ కానున్నారు.

Next Story
Share it