పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానం లాహోర్ నుండి కరాచీకి 91 మంది ప్రయాణీకులు, ఎనిమిది మంది సిబ్బందితో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకోవడం తెలిసిందే. కరాచీ ఎయిర్ పోర్టు సమీపంలోని జనావాసాల్లోకి విమానం దూసుకుని వెళ్ళింది. ఈ ప్రమాదం పట్ల అందరూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇంకొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకోబోతున్నాం అన్న ఆనందాన్ని ఈ విషాదం కబళించివేసింది. కుటుంబాలలో దుఃఖాన్ని నింపింది.

ఈ ప్రమాదంలో పాకిస్థానీ క్రికెటర్ యాసిర్ షా చనిపోయాడంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. “Heart Breaking News: Pakistani test cricketer Yasir Shah died in plane crash Karachi.. According to BCC News, Yasir Shah was in the plane when the incident happened. May Almighty Allah give him highest rank in Jannat”

పాకిస్థానీ టెస్ట్ క్రికెటర్ యాసిర్ షా కరాచీ విమాన ప్రమాదంలో చనిపోయాడు. బిసిసి న్యూస్ ప్రకారం యాసిర్ షా ఆ విమానంలో ఉన్నాడు. యాసిర్ షా స్వర్గానికి చేరుకోవాలని ప్రార్థిద్దాం అంటూ ఆ వైరల్ మెసేజీలో ఉంది.

Heart Breaking News:Pakistani Test Cricketer Yasir Shah Died in Plane Crush Karachi..According to BCC news Yasir shah…

Daily Kashmir ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಶುಕ್ರವಾರ, ಮೇ 22, 2020

ఈ న్యూస్ ను ఫేస్ బుక్, ట్విట్టర్ లో చాలా మంది షేర్ చేశారు. యాసిర్ షా ఆత్మకు శాంతి కలగాలంటూ పలువురు ట్వీట్లు చేశారు.

నిజమెంత:
వైరల్ అవుతున్న ఈ వార్త పచ్చి అబద్ధం.

యాసిర్ షా చనిపోయాడంటూ పాకిస్థాన్ కు చెందిన అధికారులెవరూ ధృవీకరించలేదు. నిర్ధారణ కోసం ప్యాసెంజర్ల లిస్టును చూడగా అందులో యాసిర్ షా పేరు లేదు.

https://www.dawn.com/news/1558947

యాసిర్ షా చనిపోయాడంటూ వస్తున్న వార్తలపై crictraker.com తెలుసుకోవాలని ప్రయత్నించింది. యాసిర్ షా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో తాను ఆ విమానంలో లేనని.. ఇంట్లో ఉన్నానని చెప్పాడు. విమాన ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించాడు.

“Tnx almighty God, I m safe in my home, and we will pray for all those we lost in plane crash may Allah give them Jannat Ul Firdos,” అంటూ ట్వీట్ చేశాడు యాసిర్ షా.

https://www.crictracker.com/rumours-of-yasir-shahs-death-in-plane-crash-surface-on-social-media-cricketer-himself-clarifies/

పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా యాసిర్ షా చనిపోలేదంటూ ధృవీకరించాయి.

https://www.boomlive.in/fake-news/no-cricketer-yasir-shah-did-not-die-in-pakistan-plane-crash-8213

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా యాసిర్ షాకు సంబంధించి ఎటువంటి ట్వీట్ కూడా చేయలేదు.

నిజమేమిటంటే: యాసిర్ షా చనిపోయాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ‘పచ్చి అబద్ధం’.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *