Fact Check : వాళ్లు షేర్ చేస్తున్న విమాన ప్రమాద దృశ్యాలు ఇప్పటివి కావా..?

By Newsmeter.Network  Published on  24 May 2020 2:13 AM GMT
Fact Check : వాళ్లు షేర్ చేస్తున్న విమాన ప్రమాద దృశ్యాలు ఇప్పటివి కావా..?

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం శుక్రవారం నాడు కరాచీలోని జనావాసాల్లో కుప్పకూలిపోయింది. 90 మంది ప్యాసెంజర్లు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్న ఈ విమానంలో కేవలం ఇద్దరు మాత్రమే కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. లాండింగ్ కోసం అనుమతి ఇచ్చినా.. పైలట్ గాల్లో తిరగడానికే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదానికి చెందిన ఎన్నో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక ఫోటోను పాకిస్థాన్ కు చెందిన ప్రజలు తెగ షేర్ చేస్తూ ఉన్నారు. ఆ విమానం ముక్కకు సంబంధించిన ఫోటోను పెట్టి “This name is not easy to destroy. A picture from yesterday’s #PIAPlaneCrash.” అంటూ షేర్ లు చేస్తూ ఉన్నారు. ఉర్దూలో ఉన్న పాకిస్థాన్ పేరును అంత ఈజీగా నాశనం చేయలేరు అని చెబుతూ ఉన్నారు.



ట్విట్టర్ లోనూ, ఫేస్ బుక్ లోనూ పలువురు ఈ ఫోటోలను షేర్ చేశారు.

నిజమెంత:

న్యూస్ మీటర్ టీమ్ ఈ ఫోటోలపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా ఈ ఫోటో 2016 సంవత్సరం లోనిది అని తేలింది. ఓ ఉర్దూ వెబ్ సైట్ లో “Pia flight PK 661 was later destroyed pieces but a name that could not be erased Pakistan. (Sic)” అంటూ ఓ కథనం కనిపించింది. పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన PK661 విమానం అన్నది నాశనం అయిందని.. కానీ పాకిస్థాన్ అన్న పేరు మాత్రం చెక్కుచెదరలేదని అందులో ఉంది.

Pakistan flight crash

PK 661ఫ్లైట్ క్రాష్ అన్న కీవర్డ్స్ ను ఉపయోగించగా.. ప్రో పాకిస్థాన్ వెబ్ సైట్ లో ఇదే ఫోటోతో ఉన్న న్యూస్ ను మనం గమనించవచ్చు. ఈ వార్తలో PK 661 విమాన ప్రమాదం గురించి రాశారు.

డిసెంబర్ 2016 లో డాన్ న్యూస్ పబ్లిష్ చేసిన వార్తలో పాకిస్థాన్ ఇంటర్ నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన PK 661 విమానం 48 మందితో ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తూ ఉండగా కూలిపోయింది. చిత్రాల్ నుండి ఇస్లామాబాద్ కు వెళ్లే సమయంలో 4:42 సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కరు కూడా బ్రతకలేదని సివిల్ ఏవియేషన్ అథారిటీ కన్ఫర్మ్ చేసినట్లు ఆ ఆర్టికల్ లో రాసుకుని వచ్చారు.

2016లో ఫేస్ బుక్ లో కూడా ఈ ఫోటోను విపరీతంగా షేర్ చేశారు.

నిజమేమిటంటే: మే 23, 2020 న చోటుచేసుకున్న విమాన ప్రమాదానికి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ ఫోటోకు ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న ఫోటో 2016 లో PK 661 విమాన ప్రమాదానికి చెందినది.

Claim Review:Fact Check : వాళ్లు షేర్ చేస్తున్న విమాన ప్రమాద దృశ్యాలు ఇప్పటివి కావా..?
Claim Reviewed By:NewsMeter
Claim Fact Check:false
Next Story