వెంటాడుతున్న 'కరోనా భయం'.. కాకినాడలో టెన్షన్‌..

By అంజి  Published on  4 March 2020 3:31 AM GMT
వెంటాడుతున్న కరోనా భయం.. కాకినాడలో టెన్షన్‌..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 3,159కి చేరింది. కరోనా వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య ఇప్పటి వరకు 92,615కు చేరింది. 7,162 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో వైపు 80 దేశాలకు కరోనా వైరస్‌ వ్యాపిచింది.

హైదరాబాద్‌ కరోనా వైరస్‌ భయం వెంటాడుతోంది. తెలంగాణలో రోజురోజుకు కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 36 అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 18,224 మందికి థర్మల్‌ స్క్రీనింగ్స్‌ నిర్వహించారు. గాంధీలో ఒక పాజిటివ్‌ కేసు నమోదు కాగా.. బాధితుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

దుబాయ్‌ నుంచి వచ్చిన నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డిపల్లి వాసికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. వారం క్రితం దుబాయ్‌ నుంచి వచ్చాడు. కామారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి అతడిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. కాగా అర్థరాత్రి అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిని గాంధీలోని వైద్యులు ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం వాసికి కరోనా సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. బాధితుడు హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఉద్యోగిని అని తెలిసింది. విధుల్లో భాగంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దక్షిణ కొరియా వెళ్లి.. వారం క్రితమే వాడపాలెం చేరుకున్నాడని తెలిసింది. ఆ ఉద్యోగి మూడు రోజులు వాడపాలెంలో ఉన్నట్లు సమాచారం. తనకు వచ్చిన సమాచారంతో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ అప్రమత్తమయ్యారు. అర్థరాత్రి వాడపాలెం వెళ్లి బాధితుడిని ప్రభుత్వ యంత్రాంగం ఆరా తీసింది. బాధితుడు వాడపాలెం నుంచి గోదశివారిపాలెం వెళ్లినట్లు గుర్తించారు. కాగా బాధితుడిని ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి భార్య, అత్తగారింట్లోని వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Next Story