ఏపీలో మరో రెండు కరోనా కేసులు.. మహారాష్ట్రలో ప్రమాద ఘంటికలు..

By అంజి  Published on  21 March 2020 4:02 PM GMT
ఏపీలో మరో రెండు కరోనా కేసులు.. మహారాష్ట్రలో ప్రమాద ఘంటికలు..

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌.. ఇప్పుడు భారత్‌లోనూ తన ప్రభావాన్ని చూపిస్తోంది. భారత్‌లో కరోనా కేసులు సంఖ్య 306కు చేరింది. ఇక అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 63 మంది కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే ఓ ప్రకటనలో తెలిపారు. తాజాగా 11 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని నిర్దారణ కాగా, అందులో 8 మందికి విదేశాల్లో కరోనా సోకగా.. ముగ్గురికి మాత్రం మహారాష్ట్రలోనే కరోనా సోకినట్టు గుర్తించారు. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మూడో దశ వైపు పయనిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మన దేశంలో కరోనా సోకిన వారిలో అత్యధికం విదేశాల నుంచి వచ్చిన వారే. అయితే ఇక్కడున్న వాళ్లకు కూడా కరోనా వైరస్‌ సోకడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

Also Read: భార్య శవాన్ని మంచంపై పడుకోబెట్టి.. భర్త అఘాయిత్యం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21కి చేరింది. ఇవాళ 35 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా రాష్ట్రంలో రోగి నుంచి మరొకరికి సోకిన కరోనా వైరస్‌ ఇదే. దుబాయి నుంచి వచ్చిన యువకుడి ద్వారా ఇతనికి కరోనా సోకిందని వైద్యులు గుర్తించారు.

Also Read: జనతా కర్ఫ్యూను ఇలా పాటించండి.!

రేపు దేశ ప్రజలంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూని పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అత్యవసరం అయితే ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కూడా ఆయన సూచించారు. దీంతో 14 గంటల పాటు ఒకరితో మరొకరు కలవకుండా ఉండడం వల్ల కొంత మేరైనా కరోనా వ్యాప్తి ఆగుతుందని ప్రధాని అన్నారు. అలాగే రేపు దేశ ప్రజలు చేయబోయే జనతా కర్ఫ్యూ భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొవడానికి సన్నద్ధం చేస్తాయన్నారు. దీంతో జనతా కర్ఫ్యూను దృష్టిలో ఉంచుకొని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు బంద్‌ను ప్రకటించాయి. బస్సులు, రైళ్ల రాకపోకలను రేపు పూర్తిగా నిలిపివేయనున్నారు. కరోనా వైరస్‌ వల్ల మన దేశంలో మరణాలు చాలా తక్కువగా ఉన్నా.. వైరస్‌ మాత్రం చాలా తీవ్రంగా ఉంది.

Next Story
Share it