జనతా కర్ఫ్యూను ఇలా పాటించండి.!

By అంజి  Published on  21 March 2020 2:07 PM GMT
జనతా కర్ఫ్యూను ఇలా పాటించండి.!

ఢిల్లీ: రేపు దేశ ప్రజలంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూని పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అత్యవసరం అయితే ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కూడా ఆయన సూచించారు. దీంతో 14 గంటల పాటు ఒకరితో మరొకరు కలవకుండా ఉండడం వల్ల కొంత మేరైనా కరోనా వ్యాప్తి ఆగుతుందని ప్రధాని అన్నారు. అలాగే రేపు దేశ ప్రజలు చేయబోయే జనతా కర్ఫ్యూ భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొవడానికి సన్నద్ధం చేస్తాయన్నారు. దీంతో జనతా కర్ఫ్యూను దృష్టిలో ఉంచుకొని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు బంద్‌ను ప్రకటించాయి. బస్సులు, రైళ్ల రాకపోకలను రేపు పూర్తిగా నిలిపివేయనున్నారు. కరోనా వైరస్‌ వల్ల మన దేశంలో మరణాలు చాలా తక్కువగా ఉన్నా.. వైరస్‌ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. కొన్ని ప్రైవేట్‌ ఉద్యోగ సంస్థలు.. వారి సంస్థల్లో పని చేసే వారికి ఇప్పటికే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రకటించాయి. వారు కూడా పూర్తిగా ఇంటికే పరిమితయ్యారు.

అయితే రేపు ప్రతి ఒక్కరూ పూర్తిగా ఇంటికే పరిమితం కావాలి. దీని వల్ల ఎంతో కొంత ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ రోజంతా అందరూ కూడా ఇంట్లో పనిని చక్కబెట్టుకోవాలి. ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవడం మేలు. ఖాళీగా కూర్చోకుండా ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవడం వల్ల వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు. టాయిలెట్‌ గదిని కడగాలి, రోజు ఆహారం తీసుకునే పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలి. కిటీకిలను, చాపలను, ఆహార పదార్ధాలు పెట్టే ప్రదేశాన్ని, కిచెన్‌లో ఉండే కుళాయిలను తోమి శుభ్రపరుచుకోవాలి. రేపు ఎలాగు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి.. ఇంట్లో ఉండే పరుపు, రిఫ్రీజిరేటర్‌, మైక్రోవేవ్‌ను శుభ్రం చేసుకోవడం మంచిది. కిటీకీ ఫ్రేమ్‌లను, మురికి నీరు పోయే పైప్‌ లైన్లను, లైట్లను, ఫ్యాన్‌లను శుభ్రం చేసుకోవడంతో ఎంతో కొంత సమయం ఆ పనిలో నిమగ్నమైపోతారు. దీంతో కొంత మేర సామాజిక దూరం పాటించినట్లవుతుంది.

ఇలా చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలి. 14 గంటలు పాటు ఇంట్లోనే ఉండి జనతా కర్ఫ్యూకు మద్దతు తెలపాలి. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఉరికే అనలేదు. వ్యక్తి గత శుభ్రత ఒకరికే మేలు చేస్తుంది.. అయితే ఇంటి శుభ్రత కుటుంబ సభ్యులందరికీ మేలు చేస్తుంది.

Next Story
Share it