20 నుంచి లాక్‌డౌన్‌కు సడలింపు.. ఏం తెరుచుకుంటాయి
By సుభాష్ Published on 19 April 2020 12:49 PM ISTకరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా తీవ్ర నష్టాల్లో ఉంది. ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఏప్రిల్ 14తో ముగిసిన లాక్‌డౌన్ మే 3 వరకూ పొడిగిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏప్రిల్ 20 తర్వాత కొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి సడలింపు ఇస్తామని ప్రకటించారు.
లాక్‌డౌన్ సడలిస్తే మళ్లీ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నెల రోజుల లాక్‌డౌన్‌తో స్తంభించిపోయింది. ఇప్పటికే వ్యవసాయ అనుబంధ, వ్యవసాయ రంగాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చాయి. ఇక తాజాగా 20 నుంచి సడలించే అంశాలు చూద్దాం.
కేంద్రం ప్రకటించిన సడలింపులు ఇవే
► అత్యవసర సేవలు, వైద్య, అత్యవసర సరుకులు, పని చేసిచేసే కార్యాలయానికి వెళ్లడానికి ప్రైవేటు వాహనాలకు అనుమతి
► గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు తెరుచుకోవచ్చు
►కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు తెరుచుకోవచ్చు
►ప్రభుత్వ, ప్రభుత్వేతర పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య, ప్రైవేటు వర్తక సంస్థలు పని చేసుకోవచ్చు
అత్యవసర, నిత్యావసర సరుకుల సరఫరా చేసుకోవచ్చు
► నిర్మాణ రంగ కార్యకలాపాలు చేపట్టవచ్చు. అయితే కార్మికులు మాత్రం నిర్మాణం దగ్గర నివసించాల్సి ఉంటుంది.
► అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మందికి మించి ఉండకూడదు
► ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్, క్లీనిక్‌లు, మెడిసిన్ సర్వీసులు రోజు పని చేస్తాయి. అలాగే అన్ని రకాల మందుల షాపులు తెరిచి ఉంటాయి
మే 3వ తేదీ వరకూ లాక్‌డౌన్‌లో ఉండేవి
► సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్, స్పోర్ట్స్, స్మిమ్మింగ్ పూల్స్, బార్లు తెరవకూడదు.
►బస్సులు, మెట్రోరైళ్లు
► విద్యాసంస్థలు, శిక్షణ సెంటర్లు, కోచింగ్ సెంటర్లు మూసి ఉంచాలి
► శుభకార్యాలు, ఇతర వేడుకలు, మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనా స్థలాలు మూసి ఉంచాలి