కరోనా స్పెషల్ ప్యాకేజీ..కాసేపట్లో నిర్మలా ప్రెస్ మీట్
By రాణి Published on 26 March 2020 1:18 PM IST
దేశమంతా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అయింది. దీని కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారు. తినేందుకు తిండి లేక, ఉండేందుకు గూడు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ప్రజలు. ఇలాంటి సమయంలో కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపటిలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నారు.
Also Read : రూ.1500 కోసం రూ.500
ఈ ప్యాకేజీలో పేదలను ఆదుకునేందుకు నేరుగా వారి అకౌంట్లలో కొంతమొత్తం నగదును జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రంగాల వారిని ఆదుకుంటామని నిర్మలా ప్రకటించారు. మూడ్రోజుల క్రితమే ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తామని చెప్పినప్పటికీ..కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఈరోజు ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది.
Also Read : విడిపోయిన జంటను కలిపిన కరోనా
Next Story