రూ.1500 కోసం రూ.500

By రాణి  Published on  26 March 2020 7:26 AM GMT
రూ.1500 కోసం రూ.500

కరోనా కారణంగా ఈ నెలాఖరు వరకూ తెలంగాణ లాక్ డౌన్ లో ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ గడువు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకూడదన్న భావనతో తెల్లరేషన్ కార్డుదారులందరికీ మనిషికి 12 కిలోల బియ్యం, కార్డుకు రూ.1500 నిత్యావసరాల కోసం అందజేస్తామని కూడా కేసీఆర్ చెప్పారు.

Also Read : హాస్టళ్లు మూసేస్తే కఠిన చర్యలు – డీజీపీ

ఇప్పుడు ఈ రూ.1500 పై పుకార్లు మొదలయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే రూ.1500 పొందాలంటే రేషన్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ ను అకౌంట్ ను అప్ డేట్ చేయించుకోవాలంటూ పుకార్లు పుట్టించారు కొందరు. ఇదే అదనుగా ఇంటర్నెట్ సెంటర్లు నడిపేవారు సదరు మధ్యతరగతి వాళ్లను దోచుకుంటున్నారు. కార్డు, అకౌండ్ అప్ డేట్ చేయాలంటే రూ.500 ఖర్చవుతుందని చెప్పి, జేబుకు చిల్లు పెడుతున్నారు దళారులు.

Also Read : కష్టకాలంలో కనికరించని పోలీసులు

ఈ పుకార్లలో నిజం లేదంటూ జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన బియ్యం, నగదును అర్హులకు అందజేస్తామని తెలిపారు. అవసరమైతే జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంటిటికి వెళ్లి బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. నగదు కోసం కార్డు, అకౌంట్ అప్ డేట్ చేయించుకోవాలన్న వాటిలో నిజం లేదని తేల్చి చెప్పారు. దయచేసి ఇలాంటి పుకార్లను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story