బ్రేకింగ్: భారత్‌లో ఆరో కరోనా మరణం .. ఒక్కరోజే ఇద్దరు మృతి
By సుభాష్ Published on 22 March 2020 1:18 PM ISTభారత్‌లో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజు ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో కరోనా కేసులు 341కి చేరగా, తాజాగా ఇద్దరి మరణాలతో ఆ సంఖ్య ఆరుకు చేరుకుంది. దాదాపు 17వేల మంది వరకు పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన 63 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందడంతో ఆ సంఖ్య ఐదుకు చేరగా, మరో వ్యక్తి బీహార్‌కు చెందిన 38 ఏళ్ల యువకుడు వైరస్‌తో చికిత్స పొందుతు ప్రాణాలు విడిచాడు. దీంతో కరోనా మరణాల సంఖ్య 6కు చేరుకుంది.
బీహార్‌కు చెందిన సైఫ్ అలీ (38) కరోనా నిర్ధారణ కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా వైరస్ సోకిన యువకుడికి మూత్ర పిండాలు సైతం చెడిపోయాయని వైద్యులు వెల్లడించారు.
తాజాగా ఏపీలోని గుంటూరుకు చెందిన యువకుడు లండన్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడి నుంచి గుంటూరుకు వెళ్లే క్రమంలో ఆయనకు కరోనా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 22కు చేరుకుంది.
ఇక మహారాష్ట్రలో 64 కేసులు నమోదు కాగా, కేరళలో 52 కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 27, ఉత్తరప్రదేశ్‌లో 26, రాజస్థాన్‌లో 23, ఏపీలో 5 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.