దాక్కున్నవారు వచ్చి రిపోర్టు చేయాలి.. లేకపోతే క్రిమినల్‌ కేసులు

By సుభాష్  Published on  8 April 2020 10:41 AM GMT
దాక్కున్నవారు వచ్చి రిపోర్టు చేయాలి.. లేకపోతే క్రిమినల్‌ కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దేశంలో కరోనా అంతరించిపోతుంది.. లాక్‌డౌన్‌ ఎత్తివేయవచ్చు అనుకునే లోపే రాకెట్‌లా దూసుకొచ్చినట్లు ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోయాయి. కారణం.. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనలు. దీంతో అప్పటి నుంచి మళ్లీ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరిగిపోయాయి. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.

Also Read

ఇక మర్కాజ్‌కు వెళ్లి వచ్చిన కొందరు బయటకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాముద్దీన్‌ మర్కజ్‌లో పాల్గొన్న వ్యక్తులు వెంటనే అధికారుల వద్ద రిపోర్టు చేయాలని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆదేశించారు. బయటకు రాకుండా దాక్కున్న తబ్లిగీలు 24 గంటల్లోగా రిపోర్టు చేయకపోతే వారిపై క్రిమినల్‌ కేసులను నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

గత నెలలో ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌ మత ప్రార్థనలు జరిగాయి. ఇందులో స్వదేశీయులతో పాటు విదేశీయులు సైతం భారీగా పాల్గొన్నారు. దీంతో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరగడానికి కారణమైంది. ఇప్పటికే చాలా మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. అయితే ఇంకొందరు క్వారంటైన్‌కు రాకుండా తప్పించుకుని తిరుతుండటంతో మధ్యప్రదేశ్‌ సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు. వారు స్వయంగా వచ్చి రిపోర్టు చేయకపోతే దేశంలో వైరస్‌ కేసుల సంఖ్య మరిన్ని పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో బుధవారం మధ్యాహ్నం నాటికి 229 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 13 మంది మృతి చెందారు.

Next Story