మోదీ చాలా మంచోడన్న అగ్రరాజ్యం పెద్దన్న

By సుభాష్  Published on  8 April 2020 7:26 AM GMT
మోదీ చాలా మంచోడన్న అగ్రరాజ్యం పెద్దన్న

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. ఇక అమెరికాలో మాత్రం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కరోనాను ఏ సమయంలోనైనా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలికిన ట్రంప్‌కు కంటిమీద కునుకు లేకుండా

మలేరియా వ్యాధి చికిత్సకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) ఎగుమతిని విదేశాలకు నిషేధిస్తూ భారత్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా చికిత్సలో వాడే ఈ మందును ఎగుమతిని భారత్‌ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో హైడ్రాక్సీక్లీరోక్విన్‌ మందులను తమకు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మోదీకి ఫోన్‌ చేశారు. ఒక వేళ మందులను ఎగుమతి చేయని పక్షంలో తాము ప్రతీకార చర్యలు దిగుతామని హెచ్చరించారు కూడా. ఇక భారత్‌ కూడా కరోనా నేపథ్యంలో ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా వైరస్‌ ఉన్న అత్యవసర దేశాలకు మందులను సరఫరా చేస్తామని, ప్రస్తుతం ఈ నిషేధాన్ని సడలిస్తున్నట్లు తెలిపింది. పైగా అమెరికాకు కావాల్సిన మందులను పంపింది భారత్‌.

మందుల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా సడలిస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై భారత్‌ చేస్తున్న పోరాటంపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ.. 29 మిలియన్లకు పైగా హెచ్‌సీక్యూ డోసులను కొనుగోలు చేశాం. అందులో అధికంగా భారత్‌ నుంచి వచ్చాయి. ఈ విషయంపై ప్రధాని మోదీతో మాట్లాడాను. ఆయన నిజంగానే చాలా మంచోడు. ఒక విధంగా చెప్పాలంటే భారత్‌లో కూడా ఈ మెడిసిన్‌ చాలా అవసరం. అందుకే వాటిని పంపుతారా లేదా.. అని నేను మోదీని అడిగాను. అయినా మంచి మనసుతో మోదీ పంపించారు... అంటూ ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

అయితే ముందుగా మెడిసిన్‌ను పంపించాలని, లేకపోతే తమ చర్యలు వేరుగా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌.. భారత్‌ నుంచి అమెరికాకు కావాల్సిన మెడిసిన్‌ పంపిన తర్వాత మాట మార్చుకున్నారు. మోదీ చాలా మంచోడంటే ప్రశంసించారు.

కోవిండ్‌-19 వ్యాక్సిన్‌ భారత్‌కే ముందు సరఫరా చేస్తాం

కాగా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీతో కలిసి తాము వ్యాక్సీన్లు తయారు చేసే పనిలో ఉన్నామని, వాటిని పరీక్షించాల్సి ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. తాము తయారు చేసే కోవిడ్‌ -19 వ్యాక్సిన్‌ను ముందుగా భారత్‌కే సరఫరా చేస్తామని పేర్కొన్నారు. మలేరియా ప్రభావిత దేశాల్లో ఇలాంటి సమస్యలు సాధారణమే అయినందున అక్కడ కరోనా ప్రభావం అంతగా లేదనిపిస్తోందని ట్రంప్‌ పేర్కొన్నారు.

అంతకు ముందే హెచ్‌సీక్యూ, పారాసిటమాల్‌ ఎగుమతులపై నిషేధాన్ని పాక్షికంగా సడలించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న భారత్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోలేదు. కాగా, తమ దేశానికి భారత ఔషధాలు పంపడంపై బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనారో సైతం మోదకి ధన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే. ముందుగా భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌ తర్వాత స్వరం మార్చుకున్నారు. మోదీని పొగడ్తలతో ముంచెత్తారు.

Next Story