బ్రేకింగ్: భారత్‌లో ఐదో కరోనా మరణం
By సుభాష్ Published on 22 March 2020 11:49 AM ISTభారత్‌లో కరోనా మరణం సంభవించింది. ముంబైకి చెందిన 63 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ వల్ల మృతి చెందాడు. మార్చి 19న కరోనాతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. మృతుడికి డయాబెటిస్ ఉందని, హైబీపీ కూడా ఉందని తెలిపింది. అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కరోనా సోకడంతో ఊపిరి పీల్చుకోవడంతో ఇబ్బందిగా మారి మృతి చెందినట్లు తెలిపింది.
ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 327కు చేరుకుంది. మహారాష్ట్రలో 64 కేసులు నమోదు కాగా, కేరళలో 52 కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 27, ఉత్తరప్రదేశ్‌లో 26, రాజస్థాన్‌లో 23, తెలంగాణలో 21, ఏపీలో 5 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.
పంజాబ్ అప్రమత్తమై పూర్తిస్థాయి లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నెల 31 వరకు పంజాబ్‌లో ఈ లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇప్పటికే రాజస్థాన్‌లో పూర్తిస్థాయి లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నాయి. త్వరలో మహారాష్ట్ర కూడా లాక్ డౌన్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.