ఏపీలో 24గంటల్లో 1933 కేసులు.. 19 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 12 July 2020 3:16 PM ISTఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,264 సాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 1933 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 1914 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 18 మంది ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరు ఉన్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరింది.
కొవిడ్ వల్ల కర్నూలు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణలో, విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, నెల్లూరు, అనంతపూర్, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 19 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 328కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 15,412 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 13,428మంది చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా...
అనంతపురంలో 129,
చిత్తూరులో 159,
ఈస్ట్ గోదావరిలో 268,
గుంటూరులో 152,
కడపలో 94,
కృష్ణలో 206,
కర్నూలులో 237,
నెల్లూరులో 124,
ప్రకాశంలో 134,
శ్రీకాకుంలో 145,
విశాఖపట్నంలో 49,
విజయనగరంలో 138,
పశ్చిమ గోదావరిలో 79 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.