దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైన కాంగ్రెస్‌..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2019 12:49 PM GMT
దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైన కాంగ్రెస్‌..

దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన హస్తం పార్టీ, విపక్షాలను కూడా కలుపుకొని వెళ్లే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈనెల 4వ తేదీన అన్ని ప్రతి పక్ష పార్టీ లతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆర్థిక మందగమనం, వ్యవసాయ రంగ సంక్షోభం, పారిశ్రామిక వృద్ధి దిగజారడం, నిరుద్యోగం సహా కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. జిల్లాలు, రాష్ట్ర రాజధానుల్లో చర్చా కార్యక్రమాలు, మీడియా సమావేశాలు, వివిధ రూపాల్లో నిరసనలు నిర్వహించి చివరి రోజు ఢిల్లీలో భారీ ఆందోళన నిర్వహించడం కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ఉంది.

ఆర్థికమందగనం, దిగజారిన పారిశ్రామిక వృద్ధిపై ఈనెల 15 వరకు నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిం చింది. ఇందులో భాగంగా 35 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు సీనియర్ నాయకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు వివరించను న్నారు. నవంబర్ 5 నుంచి 15 వరకు జిల్లాలు, రాష్ట్ర రాజధానుల్లో ఆందోళనలు నిర్వహించనున్నారు. చివరిగా, దేశ రాజధానిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ భారీ సభకు విపక్షాలను కూడా ఆహ్వానించనున్నారు.

Next Story