ఒక మహిళా ఎస్ఐకి అనూహ్య పరిస్థితి ఎదురైంది (Collector Salute to Inspector). కలలో కూడా ఊహించని అరుదైన గౌరవం లభించింది. బాగా పని చేయటం.. చేసిన దానికి పేరు ప్రఖ్యాతులు రావటం.. పురస్కారాలు లభించటం సాధారణంగా జరిగేవే. కానీ.. అందుకుభిన్నంగా ఎదురైన పరిణామం మాత్రం చాలా అరుదుగా మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటారా.తమిళనాడులోని తిరువనమలై జిల్లాలో చోటు చేసుకుంది. ఈ పంద్రాగస్టు సందర్భంగా ప్రతిభ కనబర్చిన అధికారులకు పురస్కారాలు ఇవ్వటం తెలిసిందే.

ఈ క్రమంలో తిరువనమలై జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన మహిళా ఎస్ఐ అల్లిరాణి. కరోనావేళ… ఆమె కీలకమైన సేవల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆమె పని చేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దికాలం క్రితం ఒక వ్యక్తి కరోనాతో మరణించాడు. అతడి కుటుంబ సభ్యులతో సహా.. బంధువులు సైతం అతడి మృతదేహాన్ని తరలించేందుకు ధైర్యం చాలక దూరంగా ఉండిపోయారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె.. అక్కడకు వెళ్లి ధైర్యంగా ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. కరోనా వేళ.. అయినోళ్లే చేయని పనిని.. మహిళా ఎస్ఐ మాత్రం ధైర్యంతో చేయటంపై స్థానికులు ప్రశంసల వర్షం కురిచింది. ఆమె చేసిన పనికి మెచ్చిన అధికారులు పంద్రాగస్టు వేళ.. ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు. తనకు ప్రకటించిన అవార్డును అందుకోవటం కోసం వేదికపైకి వెళ్లిన అల్లిరాణికి ఊహించని అనుభవం ఎదురైంది.

ఆమెకు పతకం.. మెమొంటోను అందజేసిన కలెక్టర్ కందస్వామి.. ఆమెను తాను నిలుచున్న డయాస్ నుంచి కిందకు దిగి.. ఆమెను నిల్చోబెట్టి తాను సెల్యూట్ చేశారు (Collector Salute to Inspector Thiruvannamalai District Collector K.S. Kandasamy made news for saluting a police inspector during the Independence Day) . అది చూసిన అక్కడి వారంతా హర్షద్వానాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైలర్ గా మారింది. కలెక్టర్ కందస్వామి తీరును పలువురు అభినందిస్తున్నారు. విధి నిర్వహణలో మానవత్వాన్ని ప్రదర్శించిన అధికారిణికి మాత్రమే కాదు.. అందరిలో స్ఫూర్తి నింపిన కలెక్టర్ తీరును పలువురు అభినందిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.