నా రాష్ట్రం - నా ఇష్టం.. కేంద్రం.. బెంగాల్‌ మధ్య వార్‌

By సుభాష్  Published on  19 May 2020 8:43 AM GMT
నా రాష్ట్రం - నా ఇష్టం.. కేంద్రం.. బెంగాల్‌ మధ్య వార్‌

కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా నాలుగో దశ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. మే 17తో ముగిసిన లాక్‌డౌన్‌3.0.. మరో వారం రోజుల పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అయితే లాక్‌డౌన్‌ -4.0లో భాగంగా కొన్ని సడలింపులు, కొన్ని ఆంక్షలు విధించింది కేంద్రం. ఇక అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తైతే.. పశ్చిమబెంగాల్‌ ఒక ఎత్తు. మోదీకి పూర్తిగా విరుద్దంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. లాక్‌డౌన్‌ ఆంక్షలు, జోన్ల విషయంలో కేంద్రం, పశ్చిమబెంగాల్‌ మధ్య వార్‌ మరింత ముదురుతోంది. నా రూటే వేరు.. నేను చెప్పిందే శాసనం.. కేంద్రం చెప్పింది మేముందుకు వినాలి.. నా రాష్ట్రం నాష్టం.. అంటున్నారు మమతా బెనర్జీ.

అయితే లాక్‌డౌన్ 4.0 సందర్భంగా కేంద్రం కొన్ని సడలింపులు..కొన్ని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ తప్పకుండా అమలు చేయాలని తెలిపింది. అంతేకాదు కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలు తప్పుకండా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్రం ఆదేశాలకు వ్యతిరేకంగా పశ్చిబెంగాల్‌లో రాత్రి సమయంలో ఎలాంటి కర్ఫ్యూ ఉండదని మమతా బెనర్జీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

అంతేకాదు లాక్‌డౌన్ 4.0లో తమదైన శైలిలో ఆంక్షలు సడలించింది. కంటైన్మెంట్‌ జోన్‌లో తప్ప.. అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల షాపులు, మాల్స్‌ తెరుచుకోవచ్చని మమతా గ్రీన్‌ సిగల్న్‌ఇచ్చారు. అంతేకాదు బస్సులు, ఆటోలకు కూడా అనుమతులు ఇచ్చారు. ఇక మమతా చెప్పిందే ఆలస్యం జనాలు రోడ్లపై తిరిగేస్తున్నారు.

Next Story