టెన్షన్‌.. టెన్షన్‌.. పోలీసులను వెంటాడుతున్న కరోనా మహమ్మారి

By సుభాష్  Published on  19 May 2020 6:37 AM GMT
టెన్షన్‌.. టెన్షన్‌.. పోలీసులను వెంటాడుతున్న కరోనా మహమ్మారి

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పిల్లల నుంచి వృద్దుల వరకూ కరోనా ఎవ్వరిని కూడా వదిలి పెట్టడం లేదు. ఇక తాజాగా పోలీసులను మరింత టెన్షన్ పెడుతోంది కరోనా.

మహారాష్ట్రలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో కూడా పోలీసులను కరోనా వైరస్‌ వెంటాడుతోంది. జమ్మూ రాష్ట్రంలో 55 మంది పోలీసులకు కరోనా సోకడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 106 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

ఇదిలా ఉండగా, ఇప్పటి వరకూ రాష్ట్రంలో 55 మంది పోలీసులకు కరోనా సోకింది. అలాగే మరో ఐదుగురు వైద్యులకు కూడా కరోనా పాజిటివ్‌ తేలింది. ఇప్పటి వరకూ జమ్మూకశ్మీర్‌లో 1289 కరోనా కేసులు నమోదయ్యాయి.

Next Story