తన మిత్రుడు.. మాజీమంత్రిని కలిసిన సీఎం కేసీఆర్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Jan 2020 6:26 PM ISTతన మిత్రుడు, అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో గోపాల కృష్ణారెడ్డిని సీఎం పరామర్శించారు. బొజ్జల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బొజ్జల ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన నివాసంలోనే మధ్యాహ్న భోజనం చేశారు.
చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి.. తెలుగుదేశం పార్టీ తరుపున శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1989వ సంవత్సరంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి తొలిసారిగా పోటీ చేసిన బొజ్జల.. భారీ మెజారిటీతో గెలుపొందాడు. అనంతరం 1994-2004 మధ్య కాలంలో చంద్రబాబు మంత్రి వర్గంలో ఐటీ మంత్రిగా, రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్సీవీ నాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. అనంతరం 2009 ఎన్నికల్లో అదే నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.