క్లాప్ క‌రోనా.. మోదీ పిలుపున‌కు పూర్తి మ‌ద్ద‌తు

By సుభాష్  Published on  22 March 2020 9:28 AM GMT
క్లాప్ క‌రోనా.. మోదీ పిలుపున‌కు పూర్తి మ‌ద్ద‌తు

క‌రోనా వైర‌స్‌.. ఈ పేరు వింటేనే వెన్నులో వ‌ణుకు పుడుతుంది. ప్ర‌పంచ దేశాలు సైతం వ‌ణికిపోతున్నాయి. ఈ వైర‌స్‌ను ఎలా క‌ట్ట‌డి చేయాలో త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితి. చైనాలో పుట్టిన ఈ వైర‌స్ మృతుల‌ను వెంటాడుతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 11వేల‌కుపైగా చేరుకుంది. దాదాపు 3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఈ వైర‌స్‌తో చికిత్స పొందుతున్నారు. రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతోంది. చైనా ఎఫెక్ట్ ప్ర‌పంచ దేశాల‌పై ప‌డిపోయింది. ఇక తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జ‌న‌తా క‌ర్ఫ్యూకు పిలుపునివ్వ‌డంతో ఆదివారం పూర్తిస్థాయిలో బంద్‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు ప్ర‌జ‌లు.

ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు స్వ‌చ్చంధంగా బంద్ పాటించాల‌ని ప్ర‌ధాని పిలుపుతో ప్ర‌జ‌లంతా ఏక‌మై స్వ‌చ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. ఎవ్వ‌రూ కూడా ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రాకుండా మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అయితే క‌ర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌తీ ఒక్క‌రు గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ప్ప‌ట్లు కొట్టాల‌ని కోరారు. అలాగే సీఎం కేసీఆర్ కూడా ఐదు గంట‌ల‌కు గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు వ‌చ్చి క్లాప్స్ కొట్టాల‌ని కోరారు. జాతి ఐక్యతను చాటి చెప్పేందుకే చప్పట్లు కొట్టేదని కేసీఆర్‌ వివరించారు.

ఈ బంద్ కార‌ణంగా రోడ్ల‌న్నీ నిర్మానుషంగా మారాయి. ఎన్న‌డు లేనంత‌గా ఎటు చూసినా జ‌నాలు క‌నిపించ‌కుండా రోడ్ల‌న్నీ వెల‌వెల‌బోయాయి. ఇప్ప‌టికే ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్‌లు, షాపింగ్ మాల్స్‌, ఇత‌ర సంస్థ‌లు మూత‌ప‌డ్డాయి.

Next Story