ఉగాదికి మెగా ఎంట్రీ.. సోషల్ మీడియా షేకే !
By న్యూస్‌మీటర్ తెలుగు
మన స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎంత వేగంగా పెరిగిందో.. నేటి యువతరం అభిరుచి కూడా అంతకన్నా వేగంగా మారుతుంది. ఇప్పుడు అందరూ సోషల్ మీడియా వైపే వెళ్తున్నారు. దాంతో సినీ ప్రముఖులు సైతం డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఒక వీడియోను రిలీజ్ చేశారు.
వీడియోలో చిరు మాట్లాడుతూ... ఇక నుండి తన భావాలను అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ప్రజలతో ఫ్యాన్స్ తో పంచుకోవటానికి తానూ కూడా ఉగాది నుండి సోషల్ మీడియాలోకి వస్తోన్నట్లు మెగాస్టార్ వీడియోలో తెలిపారు. ఇది మెగాస్టార్ అభిమానులకు శుభవార్తే. తమ అభిమాన హీరో ఆలోచనలను అభిప్రాయాలను ఎప్పటికపుడు వాళ్ళు తెలుసుకోవచ్చు.
ఇక ప్రస్తుతం మెగాస్టార్, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు నెలలో చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్.