డిస్క‌వ‌రీ ఛాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌య్యే మ్యాన్ వ‌ర్సెప్ వైల్డ్ షోలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌నిపించారు. సోమ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు ఈ షో ప్ర‌సారమైంది. క‌ర్ణాట‌క‌లోని బందిపొరా టైగ‌ర్‌రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో బేర్ గిల్స్‌తో క‌లిసి ర‌జ‌నీకాంత్ సాహ‌సాలు చేశారు. మొద‌టి సారి బుల్లితెర‌పై సూప‌ర్ స్టార్ క‌నిపించ‌డంతో అభిమానుల ఆనందానికి అడ్డులేకుండా పోయింది.

ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో ఓ వీడియో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అందులో ర‌జ‌నీకాంత్ స్టైల్‌గా క‌ళ్ల‌జోడు పెట్టుకోవ‌డం చూసిన బేర్‌గిల్స్ త‌ను కూడా అలా పెట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు.. అయితే.. అది బేర్‌గిల్స్ వ‌ల్ల కాలేదు. దీంతో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ ఆయ‌న‌కు సాయం చేశాడు. ర‌జ‌నీ ఇలా చేయాల‌ని చెప్పినా ఫ‌లితం లేక‌పోయింది. అందుకే నువ్వు సినిమా స్టార్ అని బేర్స్ గిల్స్ ర‌జ‌నీని మెచ్చుకున్నారు ఆ వీడియోలో. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ ఫ‌న్నీ వీడియో నెటిజన్ల‌ను తెగ‌న‌వ్విస్తోంది.తోట‌ వంశీ కుమార్‌

Next Story