ఈ ప్రపంచ సాహసికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ 'ఇంటూ ద వైల్డ్' కార్యక్రమం కోసం స్పెషల్ ఎపిసోడ్ రూపొందించాడు. ఈ మార్చి 23న రాత్రి 8గంటలకు ఈ కార్యక్రమంల డిస్కవరీ ఛానల్లో ప్రసారం కానుంది. తాజాగా, దీనికి సంబంధించిన స్నీక్ పీక్ మూమెంట్స్ వీడియోను విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కోసం రజనీకాంత్, బేర్ గ్రిల్స్ జోడీ కర్ణాటకలోని బండిపుర అడవిలోకి వెళ్లారు.

ఇక ఈ వీడియోలో రజనీకాంత్ విన్యాసాలను అబ్బురపరిచాయి. ఓ వంతెన ఇనుప రెయిలింగ్ పై రజనీ, బేర్ గ్రిల్స్ నడవడం సినిమా స్టంట్ కు తీసిపోని విధంగా ఉంది. కాగా, సినిమాల్లోకి రాకముందు మీరేం చేసేవారు? అని ఓ సందర్భంలో బేర్ గ్రిల్స్ రజనీకాంత్‌ను ప్రశ్నించాడు. అందుకు సూపర్‌ స్టార్‌ తనదైన శైలిలో బస్‌ కండక్టర్‌ అని సమాధానం ఇచ్చాడు. రజనీ చెప్పిన సమాధానానికి ఆశ్చరపోయాడు బేర్‌ గిల్స్‌. మరో సంభాషణలో తాను సినిమాల వరకే రజనీకాంత్ నని, ఇంటికి వెళితే శివాజీరావ్ గైక్వాడ్ నని తెలిపారు. ఎవరన్నా గుర్తు చేస్తే తప్ప రజనీకాంత్ నన్న విషయం గుర్తుకు రాదన్నారు. షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పగానే రజనీ అన్న పేరును మరిచిపోతానని చెప్పాడు. అంతేకాదు, ఇలాంటి సాహసాలను తన జీవితంలో ఎన్నడూ చేయలేదని రజనీకాంత్ విస్మయం వ్యక్తం చేశారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story