గాయకుడిని పెళ్లాడిన అమలాపాల్

నటి అమలాపాల్‌ తన ప్రియుడు భవిందర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పలువురు ఫోటోలను షేర్‌ చేస్తున్నారు.

2014లో దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ తరువాత మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడని చెప్పింది. కాగా సదరు వ్యక్తి పేరు మాత్రం వెల్లడించలేదు.

Amala paul married mumbai based singer

కాగా.. ముంబాయికి చెందిన గాయకుడు భవిందర్‌ సింగ్‌.. అమలాపాల్‌తో కలిసి తీసుకున్న ఫోటోలను పలు సందర్భాల్లో షేర్‌ చేశాడు. ఆమెను హత్తుకుని ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై వీరిద్దరు స్పందించలేదు.

కాగా.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహాం జరిగినట్లు తెలుస్తోంది. కాగా పెళ్లిపై ఇప్పటి వరకు అమలాపాల్, భవిందర్‌ సింగ్‌లు స్పందించలేదు.Amala paul married mumbai based singer

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *