డ్రాగన్‌కు మరో భారీ షాక్ ఇవ్వనున్న మోదీ సర్కార్
By సుభాష్ Published on 13 July 2020 8:39 AM ISTభారత్ - చైనా దేశాల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో చైనాకు భారత్ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే చైనాకు సంబంధించిన 59 యాప్‌లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. త్వరలో చైనాకు సంబంధించిన 350 వస్తువుల దిగుమతిని పూర్తిగా నిషేధించబోతోంది. వీటిలో ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎక్స్ లైల్స్ వస్తువులు, బొమ్మలు, ఫర్నిచర్‌లు వంటివి ఉన్నాయి. ఇలాంటివి ఎక్కువగా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. కానీ దేశీయంగా కూడా వీటిని ఉత్పత్తి చేయవచ్చు. ఆ దిశగా కూడా రాష్ట్రాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని కనుక నిషేధిస్తే చైనాకు ఇక చుక్కలే కనిపిస్తాయి.
ఇప్పటి వరకూ విదేశాల నుంచి వస్తున్న వస్తువులపై కేంద్ర ఎక్కువగా దృష్టి పెట్టలేదు. కానీ చైనా జిత్తులమారి వేషాలు తెలిసిన తర్వాత కేంద్రం ఏకంగా ఓ మానిటరింగ్ వ్యవస్థను పెట్టి ఏయే వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంటోంది.? వాటిలో వేటిని స్థానికంగా తయారు చేయవచ్చు.. అన్నది పరిశీలిస్తోంది.
కేంద్రం అభిప్రాయాలతో ఎన్నో లాభాలు
తాజాగా కేంద్రం తీసుకుంటున్న అభిప్రాయాల వల్ల చాలా లాభాలున్నాయి. దేశీయ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. అలాగే నిరుద్యోగం తగ్గి యువతకు ఉపాధి లభిస్తుంది. దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు చైనా లాంటి దేశాల పొగరు దించినట్లవుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో నీతి ఆయోగ్, ఆర్థిక శాఖ దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
ఏడాదికి 127 బిలియన్ డాలర్లు
అయితే చైనాకు సంబంధించిన నిషేధించాలనుకుంటున్న వస్తువుల విలువ ఏడాదికి 127 బిలియన్ డాలర్లు. ఇంత మొత్తాన్ని భారత్‌నుంచి చైనా కొల్లగొడుతోంది. అలాగే చైనా వస్తువుల్లో పెద్దగా నాణ్యత ఉండదు. యూజ్ అండ్ త్రో మాత్రమే. కొన్ని కొన్ని వస్తువులు తక్కువ కాలం మాత్రమే వస్తాయి. నాణ్యత అనేది పెద్దగా ఉండదు. అదే ఇండియాలో తయారు చేసుకుంటే మంచి నాణ్యతతో చేసుకోవచ్చు. అందుకే మేక్ ఇన్ ఇండియా అనే నినాదం కూడా భారత్ తీసుకువచ్చింది. ఇకపై వస్త్రాలు, బొమ్మలు, ఇతర వస్తువులు, ర్నిచర్ వంటివి భారత్‌లోనే తయారు కానున్నాయి. అలాగే మందులు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు కూడా భారత్‌లోనే తయారు చేస్తారు. అంతేకాదు ఇవి ఎక్కడ తయారయ్యాయే పూర్తిగా వివరాలు ఉంటాయి. అదే చైనా అయితే ఎలాంటి వివరాలు ఉండవు. ఇలా చైనా వస్తువులపై నిషేధం విధించడం వల్ల చైనాకు భారీ గండిపడే అవకాశం ఉంది.