విశాఖలో కారు దగ్ధం
By తోట వంశీ కుమార్ Published on 31 Aug 2020 2:31 PM IST
విశాఖ జిల్లాలో కారు దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. హఠాత్తుగా కారు నుంచి మంటలు చెలరేగాయి. అయితే.. డ్రైవర్ అప్రమత్తతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా గోపాలపట్నం పెట్రోల్ బంక్ కూడలి సమీపంలో ఎయిర్ పోర్ట్ నుండి సింహాచలం వైపు వెళ్తున్న టాటా ఇండిగో కారులోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ కారును నిలిపివేశాడు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అప్రమత్తమై వెంటనే కారు దిగి పరుగులు తీశారు. క్షణాల్లో మంటలు కారు మొత్తానికి వ్యాపించాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read
ఏపీలో మరో దళిత యువకుడికి శిరోముండనంNext Story