విశాఖ శిరోముండనం బాధితుడిని పరామర్శించిన మంత్రి అవంతి శ్రీనివాస్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2020 1:22 PM GMT
విశాఖ శిరోముండనం బాధితుడిని పరామర్శించిన మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖ జిల్లా పెందుర్తిలో శిరోముండనం బాధితుడు శ్రీకాంత్‌ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పరామర్శించారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళితులపై దాడులను ప్రభుత్వం సహించదన్నారు. ఘటన జరిగిన 24గంటల్లో నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. భవిష్యత్తుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితుడికి ఆయన రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. బాధితుడు శ్రీకాంత్‌ను పరామర్శించిన వారిలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌, వైఎస్సార్‌ సీపీ నగర కన్వీనర్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

ఈ కేసులో ఇప్పటికే విశాక పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఏడుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వారిలో బిగ్ బాస్ ఫేమ్ నూతన్‌నాయుడి భార్య సహా నలుగురు మహిళలు ఉన్నారు. నూతన్‌నాయుడు ఇంట్లో సీసీటీవీ కెమెరా విజువ‌ల్స్ పరిశీలించి, ఆధారాలు సేకరించారు. ఈ కేసు దర్యాప్తులో సీసీ విజువ‌ల్స్ కీల‌కంగా మారాయి. నూతన్‌నాయుడు భార్య ప్రియమాధురితో పాటు దాడులకు పాల్పడిన బ్యూటీషియ‌నన్ ఇందిరారాణి, బార్బ‌ర్ రవికుమార్‌, ఇతర ఉద్యోగులు వరహాలు, బాలగంగాధర్‌, ఎం.ఝాన్సీ, కె.సౌజన్యలను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story