జోమాటో సరికొత్త నిర్ణయం.. వాటిని స్కిప్ చేసుకునే ఛాన్స్..!

Zomato CEO's Appeal To Help Save 5,000 Kilos Of Plastic In A Day. ప్రముఖ ఫుడ్ బిజినెస్ యాప్ జోమాటో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్లాస్టిక్ స్పూన్

By అంజి  Published on  31 Aug 2021 3:59 AM GMT
జోమాటో సరికొత్త నిర్ణయం.. వాటిని స్కిప్ చేసుకునే ఛాన్స్..!

ప్రముఖ ఫుడ్ బిజినెస్ యాప్ జోమాటో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్లాస్టిక్ స్పూన్లు, ఫొర్క్స్‌ వద్దనకుంటే స్కిప్ చేసేలా ఇన్, అవుట్ ఆప్షన్‌తో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఒక వేళ వినియోగదారుడికి స్పూన్‌లు, ఫొర్క్స్‌, టిష్యూలు కావాలనుకుంటే రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా జోమాటో సీఈవో దీపిందర్ గోయలే చెప్పారు. ఈ తాజా నిర్ణయంపై దీపిందర్ గోయలే ట్వీట్ చేశారు. ' చిన్న మార్పు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని, మీరూ ఇలా చేయాలనుకుంటే.. కట్లరీ ఆప్షన్‌ను ఎన్నకోకుండా మీ వంతు సాయం చేయాలంటూ' ట్వీట్ చేశారు.

తాజాగా నిర్వహించిన సర్వేలో చాలా మంది తమకు ప్లాస్టిక్ వస్తువులు వద్దంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక నుండి ఈ కొత్త విధానాన్ని అనుసరించాలని జొమాటో రెస్టారెంట్లకు తెలిపింది. ఇలాంటి చిన్న మార్పులతోనే పర్యావరణానికి ఎంతో మేలు చేసినవారం అవుతామని దీపిందర్ గోయలే అన్నారు. ఇటీవలే ఐవోపీతో దుమ్మురేపిన జొమాటో.. ఎప్పటికప్పుడు తమ నిర్ణయాలతో కస్టమర్లకు మరింత దగ్గరవుతోంది. డిస్కౌంట్లు, మెంబర్‌షిప్‌లు, నో సర్జ్‌ ఫీ, నో డిస్టెన్స్‌ పీ పేర్లతో ఆహార ప్రియులను తన వైపు లాక్కోంటోంది.


Next Story