నిన్నటి పతనం నుంచి కోలుకున్న‌ స్టాక్ మార్కెట్..!

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి.

By Medi Samrat
Published on : 8 April 2025 9:52 AM IST

నిన్నటి పతనం నుంచి కోలుకున్న‌ స్టాక్ మార్కెట్..!

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి. క్రితం రోజు పతనం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైంది, జాగ్రత్తగా ట్రేడింగ్ చేసింది. ప్రారంభ ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 1,283.75 పాయింట్లు జంప్ చేసి 74,421.65 వద్దకు చేరుకుంది. అలాగే నిఫ్టీ కూడా 415.95 పాయింట్లు పెరిగి 22,577.55 పాయింట్లకు చేరుకుంది.

గ్లోబల్ ట్రేడ్ వార్ ఆందోళనలు, అమెరికాలో పెరుగుతున్న మాంద్యం భయాల మధ్య సోమవారం అంతకుముందు, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. భారతీయ మార్కెట్ కూడా ప్ర‌భావిత‌మైంది. సెన్సెక్స్, నిఫ్టీ వంటి ప్రధాన సూచీలు భారీ పతనంతో ముగిశాయి. ఈ కాలంలో గత 10 నెలల్లో సెన్సెక్స్ 30 షేర్ల బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో ఒక రోజులో అతిపెద్ద క్షీణత నమోదైంది.

సోమవారం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో భారీ పతనం మధ్య.. మంగళవారం ముఖ‌చిత్రం మారినట్లు కనిపించింది. ఈ సమయంలో ఆసియా మార్కెట్లలో వృద్ధి కనిపించింది. జపాన్ నిక్కీ 225 స్టాక్ ఇండెక్స్ నిన్న‌ 8 శాతం పడిపోయింది.. అయితే మంగళవారం 5.5 శాతం లాభపడింది. దక్షిణ కొరియా కోస్పి కూడా 2 శాతం పెరిగింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా పుంజుకున్నాయి.

Next Story