గెలాక్సీ A26 5Gని భారత్‌లో విడుదల చేసిన సామ్‌సంగ్
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, ఏఐ శక్తితో కూడిన తమ అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ 26 5జి ని విడుదల చేయటం ద్వారా ఏఐ ప్రతి ఒక్కరికి చేరువ చేసే తీరును మరింతగా పునర్నిర్వచిస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, ఏఐ శక్తితో కూడిన తమ అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ 26 5జి ని విడుదల చేయటం ద్వారా ఏఐ ప్రతి ఒక్కరికి చేరువ చేసే తీరును మరింతగా పునర్నిర్వచిస్తోంది. సౌకర్యవంతమైన అనుభవం అందించటం కోసం రూపొందించబడిన గెలాక్సీ ఏ 26 5జి శైలి, మన్నిక, పనితీరు మరియు ఆవిష్కరణల సమతుల్యతను అందిస్తుంది, ఇది రోజువారీ ఉపయోగం కోసం సరైన ఎంపికగా మారుతుంది.
అద్భుతమైన మేధస్సు
గెలాక్సీ ఏ 26 5జి కి అద్భుతమైన మేధస్సు ను సామ్‌సంగ్ తీసుకువస్తుంది, ఇది రోజువారీ పనులను మరింత తెలివిగా , సులభంగా చేస్తుంది. ఇంటెలిజెంట్ ఏఐ సూట్, గూగుల్ తో సర్కిల్ టు సెర్చ్ విత్ , ఏఐ సెలెక్ట్, ఆబ్జెక్ట్ ఎరేజర్, మై ఫిల్టర్స్ మరియు మరిన్ని వంటి ఫీచర్లతో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
గత సంవత్సరం గెలాక్సీ ఏ సిరీస్ పరికరాల్లో అభిమానులకు ఇష్టమైన సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్ - ఇప్పుడు కేవలం చిత్రాలకు మించి, వినియోగదారులు పాటలను గుర్తించడానికి, సమాచారాన్ని కనుగొనడానికి మరియు కనీస ప్రయత్నంతో తక్షణ చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తుంది. తాజా ఆధునీకరణలతో, వినియోగదారులు ఇప్పుడు తమ ఫోన్‌లో మరిన్ని చేయవచ్చు. గూగుల్ తో సర్కిల్ టు సెర్చ్ తో ఫోన్ నంబర్‌లు, ఇమెయిల్ చిరునామాలు మరియు యుఆర్ఎల్ లను స్క్రీన్‌పై త్వరగా గుర్తిస్తుంది, తద్వారా వినియోగదారులు కనీస ప్రయత్నంతో చర్యలు తీసుకోవచ్చు.
గెలాక్సీ ఏ 26 5జి కూడా ఆబ్జెక్ట్ ఎరేజర్‌తో వస్తుంది, ఇది ఫోటోల నుండి అవాంఛిత అంశాలను తొలగించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వినియోగదారులు తుడిచివేయడానికి ఆ అంశాలను మాన్యువల్‌గా లేదా స్వయంచాలకంగా ఎంచుకోవచ్చు, కేవలం కొన్ని ట్యాప్‌లతో స్వచ్ఛమైన , మరింత మెరుగుపెట్టిన తుది చిత్రాన్ని సాధించవచ్చు.
ఏఐ సెలెక్ట్ ఒకే క్లిక్‌తో తక్షణ శోధన మరియు సమాచారాన్ని సంగ్రహించడం ద్వారా సందర్భాన్ని సహజంగా అర్థం చేసుకుంటుంది. వినియోగదారులు తమ వ్యక్తిగతీకరించిన ఫిల్టర్‌లను సృష్టించడానికి మై ఫిల్టర్స్ వీలు కల్పిస్తాయి. ఈ వినూత్న ఫంక్షన్ వినియోగదారులు తమ రంగులు మరియు శైలులను అనుకరించడం ద్వారా , వాటిని కొత్త చిత్రాలకు తక్షణమే వర్తింపజేయడం ద్వారా తాము ఇష్టపడే ఫోటోల రూపాన్ని , అనుభూతిని ఒడిసిపట్టటానికి అనుమతిస్తుంది. ప్రతి కస్టమ్ ఫిల్టర్ భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో సులభంగా పొందడం కోసం కెమెరా యాప్‌లో సౌకర్యవంతంగా సేవ్ చేయబడుతుంది, ఇది మరింత వ్యక్తిగతీకరించిన, సృజనాత్మక ఫోటోగ్రఫీ అనుభవాన్ని అనుమతిస్తుంది.
అద్భుతమైన డిజైన్ మరియు డిస్ప్లే
గెలాక్సీ ఏ 26 5జి దాని ప్రీమియం గ్లాస్ బ్యాక్ సౌందర్యంతో పీచ్, మింట్, వైట్ మరియు బ్లాక్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగులలో ప్రత్యేకంగా నిలుస్తుంది, వినియోగదారులు ఫోన్ యొక్క డిజైన్ ద్వారా తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచడానికి అనుమతిస్తుంది. పెద్ద 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వీక్షణ అనుభవాలను మెరుగుపరుస్తుంది. ఈ పరికరం దాని ముందు తరపు ఫోన్ల కంటే సన్నగా ఉంటుంది, కేవలం 7.7mm మందం కలిగిన ఈ ఫోన్ , ఆకర్షణీయంగా ఉండటం తో పాటుగా పట్టుకోవడంగానూ సులభంగా ఉంటుంది.
అద్భుతమైన పనితీరు
గెలాక్సీ ఏ 26 5జి లో అత్యంత కీలకంగా ఎక్సినాస్ 1380 ప్రాసెసర్ ఉంది, ఇది సౌకర్యవంతమైన రీతిలో మల్టీ టాస్కింగ్, మెరుగైన గేమింగ్ మరియు మృదువైన రీతిలో రోజువారీ పనితీరును నిర్ధారిస్తుంది. వాపర్ ఛాంబర్ ఇప్పుడు గత తరంతో పోలిస్తే 3.7 రెట్లు పెద్దది, ఇది తీవ్రమైన గేమ్‌ప్లే సమయంలో కూడా పరికరాన్ని సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జ్ మద్దతుతో 5000mAh బ్యాటరీతో కూడిన గెలాక్సీ ఏ 26 5జి మీ జీవనశైలికి అనుగుణంగా రోజంతా శక్తిని అందిస్తుంది.
అద్భుతమైన కెమెరా
ఫోటోగ్రఫీ ప్రియులు ఫ్లాగ్‌షిప్ 50మెగా పిక్సెల్ ఓఐఎస్ ప్రధాన కెమెరాను ఇష్టపడతారు, ఇది స్పష్టమైన, మసకలేనట్టి చిత్రాలను ఒడిసిపడుతుంది. 8మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా విస్తారమైన ప్రకృతి దృశ్యాలకు సరైనది, అయితే 2మెగా పిక్సెల్ మాక్రో కెమెరా వివరణాత్మక క్లోజప్ షాట్‌లను అనుమతిస్తుంది. 13MP ఫ్రంట్ కెమెరా అధిక-నాణ్యత సెల్ఫీలను నిర్ధారిస్తుంది. స్థిరమైన రీతిలో చిత్రాలను ఒడిసిపట్టటానికి సహాయపడుతుంది
అద్భుతమైన మన్నిక
గెలాక్సీ ఏ 26 5జి తమ విభాగంలో మన్నికకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది . దీర్ఘకాలిక విశ్వసనీయతను నిర్ధారిస్తూ రోజువారీ సవాళ్లను తట్టుకునేలా రూపొందించబడింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ అత్యుత్తమ స్క్రాచ్ , డ్రాప్ నిరోధకతను అందిస్తుంది, ప్రమాదవశాత్తు పడిపోవడం నుంచి మెరుగైన రక్షణను అందిస్తుంది. ఐపి 67 నీరు మరియు ధూళి నిరోధక రేటింగ్ అదనపు మనశ్శాంతిని నిర్ధారిస్తుంది, గెలాక్సీ ఏ 26 5జి చినుకులు , వర్షం మరియు ధూళి సైతం తట్టుకునేలా చేస్తుంది.
గెలాక్సీ ఏ 26 5జి ఈ విభాగంలో అత్యుత్తముగా 6 సంవత్సరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు మరియు 6 సంవత్సరాల భద్రతా నవీకరణలతో రూపొందించబడింది, వినియోగదారులు రాబోయే సంవత్సరాల్లో తాజా సాఫ్ట్‌వేర్ పురోగతులు , బలమైన భద్రత నుండి ప్రయోజనం పొందేలా చేస్తుంది. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సాఫ్ట్‌వేర్ మద్దతుతో మన్నికైన నిర్మాణాన్ని కలపడం ద్వారా, వినియోగదారులకు దీర్ఘకాలిక విలువ, విశ్వసనీయతకు ప్రాధాన్యతనిచ్చే బ్రాండ్‌గా సామ్‌సంగ్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుంది.
అద్భుతమైన ప్రతిపాదన
అందుబాటులో ఉన్న ధర వద్ద ప్రీమియం అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన గెలాక్సీ ఏ 26 5జి నేటి నుండి Samsung.com, సామ్‌సంగ్ ఎక్స్క్లూజివ్ స్టోర్‌లు, ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్‌లలో రూ. 22999* అద్భుతమైన ధరకు అందుబాటులో ఉంది. గెలాక్సీ ఏ 26 5జి 8జిబి RAMతో రెండు స్టోరేజ్ అవకాశాలలో వస్తుంది - 128GB మరియు 256GB, రెండూ మైక్రో SD ద్వారా 2TB వరకు విస్తరించదగినవి, అన్ని కంటెంట్‌కు తగినంత స్థలాన్ని అందిస్తాయి.