ఈ సీజన్ లోనే అత్యధిక ధర పలుకుతున్న టమాటా

Retail Tomato Prices Skyrocket up to Rs100 in Retail Market. ఈ సీజన్‌లో టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కురుస్తున్

By Medi Samrat  Published on  22 Nov 2021 8:29 PM IST
ఈ సీజన్ లోనే అత్యధిక ధర పలుకుతున్న టమాటా

ఈ సీజన్‌లో టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. రిటైల్ మార్కెట్‌లో రూ.98-100, హోల్‌సేల్‌లో రూ.93 వరకు ధరలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కిలో ధర రూ.120కి పెరిగింది. టమాటాను చాలా వంటలలో ఉపయోగిస్తూ ఉంటారన్నది తెలిసిందే.. ముఖ్యంగా మాంసాహార వంటలలో ఉపయోగించే ఒక ప్రాథమిక కూరగాయ అనేది కూడా జగమెరిగిన సత్యం. ప్రస్తుతం పెరుగుతున్న టమాటా ధర ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. కూరగాయల వ్యాపారులు కూడా ఈ టమోటాలు రాబోయే వారాల్లో మరింత ఖరీదైనవిగా ఉండవచ్చని భావిస్తున్నారు. వర్షంతో పాటు పెరుగుతున్న ఇంధన ధరలు కూడా రవాణా ఖర్చుల కారణంగా కూరగాయలు ఖరీదైనవిగా మారుతున్నాయని వారు చెప్పారు.

ఎక్కువగా టమాటాలు పండించే దక్షిణ భారత రాష్ట్రాల్లో వర్షాల కారణంగా పంటలు బాగా దెబ్బతిన్నాయి. అందువల్ల టమాటా ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితికి ఇది ఏకైక కారణం కాదని.. ఇంధన ధరల పెరుగుదల, ముఖ్యంగా డీజిల్, కూరగాయల రవాణా ఖర్చులు పెరిగాయి కాబట్టి... సరఫరాలో కొరతతో పాటు, పెరిగిన రవాణా ఖర్చు ఇప్పుడు కూరగాయలను హోల్‌సేల్‌తో పాటు రిటైల్‌ మార్కెట్లలో ధర పెరగడానికి ప్రభావాన్ని చూపుతోంది. నేషనల్ హార్టికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ప్రకారం భారతదేశంలో 7.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణం నుండి దాదాపు 19.75 మిలియన్ టన్నుల టమోటాను ఉత్పత్తి చేస్తోంది. హెక్టారుకు సగటున 25.05 టన్నుల దిగుబడి వస్తోంది. భారతదేశం చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద టమోటా ఉత్పత్తిదారుగా కొనసాగుతూ ఉంది.


Next Story