గుడ్న్యూస్ చెప్పిన RBI..కీలక వడ్డీరేట్లు తగ్గింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik
గుడ్న్యూస్ చెప్పిన RBI..కీలక వడ్డీరేట్లు తగ్గింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడో సారి రెపోరేట్ తగ్గించింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఈ సారి 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లను తగ్గించినట్లు పేర్కొన్నారు. కాగా ఇంతకు ముందు రెండు సార్లు 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుత నిర్ణయంతో హోం, వాహన, పర్సనల్ లోన్స్ ఈఎంఐలు తగ్గే అవకాశం ఉన్నాయి.
రెపో రేటు అంటే ఏమిటి?
రెపో రేటు అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటు. ఈ రేటు ఎంత తక్కువగా ఉంటే, బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు తీసుకోగలవు, దీని వల్ల వినియోగదారులకు రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. ఈ రెపో రేటును తగ్గించడం అనేది ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని పెంచడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి RBI తీసుకునే ఒక చర్య. 2025 ఫిబ్రవరిలో, RBI రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25%కి చేర్చింది, ఇది ఐదు సంవత్సరాలలో మొదటి తగ్గింపు. ఇప్పుడు, జూన్ 2025లో, మరో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో రెపో రేటు 5.5%కి చేరింది.