ఆర్‌బీఐ షాక్‌.. రెపో రేటు పెంపు.. భారం కానున్న ఈఎంఐలు

RBI hikes repo rate by 25 basis points to 6.5%.రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మ‌రోసారి రెపో రేటును పెంచింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Feb 2023 5:34 AM GMT
ఆర్‌బీఐ షాక్‌.. రెపో రేటు పెంపు.. భారం కానున్న ఈఎంఐలు

రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మ‌రోసారి రెపో రేటును పెంచింది. మానిటరీ పాలసీ కమిటీ సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ విష‌యాన్ని ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ బుధ‌వారం ప్ర‌క‌టించారు. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. గ‌త కొంత‌కాలంగా రెపోరేటును ఆర్‌బీఐ పెంచుతూ పోతుంది. ఇలా రెపోరేటును పెంచుతూ పోవ‌డం వ‌రుస‌గా ఇది ఆరో సారి. గతేడాది మే నెల నుంచి చూస్తే రెపో రేటును ఏకంగా 250 బేసిస్ పాయింట్ల వ‌ర‌కు పెరిగింది.

అయితే.. రివ‌ర్స్ రెపో రేటులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు. 3.35గానే ఉంది. దేశీయంగా రిటైల్ ద్ర‌వ్యోల్భ‌ణం శాంతిస్తుండ‌డం, అమెరికా ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ ప్రామాణిక వ‌డ్డీ రేట్ల‌పై మ‌ధ్య‌స్త వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో రెపోరేటును ఆర్‌బీఐ స్వల్పంగా పెంచింది.

రెపోరేటును పెంచ‌డం వ‌ల్ల దీని ప్ర‌భావం బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల‌పై నేరుగా ప్ర‌భావం చూప‌నుంది. ఈ భారాన్ని బ్యాంకులు నేరుగా క‌స్ట‌మ‌ర్ల‌కు బ‌దిలీ చేస్తాయి. అన్ని ర‌కాల లోన్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను బ్యాంకులు పెంచుతాయి. దీంతో నెలవారీ ఈఎంఐలు మరింత పెరగొచ్చు. అలాగే రుణాలు మరింత భారం కానున్నాయి.

ఇదిలా ఉంటే.. రెపో రేటు పెంపు వల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి ఊరట క‌లుగుతాది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి.

Next Story