2021లో రాకెట్‌ స్పీడుతో దూసుకెళ్తున్న అదానీ సంపద.. ప్రపంచ కుబేరులందరిని వెనక్కి నెట్టేసి..

Quiet India Tycoon Beats Musk, Ambani to Add The Most Wealth. భారతదేశంలో ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ సంపాదన స్పీడుగా దూసుకెళ్తోంది.

By Medi Samrat  Published on  13 March 2021 8:33 AM IST
2021లో రాకెట్‌ స్పీడుతో దూసుకెళ్తున్న అదానీ సంపద.. ప్రపంచ కుబేరులందరిని వెనక్కి నెట్టేసి..

భారతదేశంలో ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ సంపాదన స్పీడుగా దూసుకెళ్తోంది. 2021లో ప్రపంచ కుబేరులైన అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌లను మించి అదానీ ఆదాయాన్నిఆర్జించారు. గడిచిన రెండు నెలల్లో 16.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.18 లక్షల కోట్లు) నికర ఆదాయాన్ని ఆదానీ ఆర్జించారని బ్లూమ్‌బర్గ్‌ బిలయనీర్‌ బిలయనీర్ ఇండెక్స్ వెల్లడించింది. దీంతో ఈ సంవత్సరంలో అత్యంత ఆదాయాన్నిసంపాదించిన కుబేరులందరినీ అదానీ వెనక్కి నెట్టేశారు.

ఇక ఆసియాలోనే సంపన్నుడైన అంబానీ సంపాదన 2021లో 810 కోట్ల డాల‌ర్లు (సుమారు రూ.59 వేల కోట్లు) ఉండగా, అదానీతో పోలిస్తే ఇది స‌గ‌మే అని చెప్పాలి. ప్రస్తుతం వచ్చిన 16.2 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో అదానీ సంపద 50 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.3.64 లక్షల కోట్లు)కు చేరుకుంది. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, డాటా సెంటర్లు, రైల్వే స్టేషన్‌లు, బొగ్గు గనుల ద్వారా ఇంత భారీ స్థాయిలో అదానీ లాభాలు ఆర్జించారని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ తెలిపింది.


అయితే బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ వెల్ల‌డించిన ప్రకారం.. ఈ సంవత్సరం ఒక్క కంపెనీ తప్ప మిగతావన్ని అదానీ కంపెనీ షేర్లు 50శాతం మేర పెరిగాయి. అదానీ టోట‌ల్ గ్యాస్‌ లిమిటెడ్‌ 96 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 90శాతం, అదానీ ట్రాన్స్‌మిష‌న్ లిమిటెడ్ 79 శాతం, అదానీ ప‌వ‌ర్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ 52 శాతానికిపైగా, అదానీ గ్రీన్ ఎన‌ర్జీ లిమిటెడ్ 12 శాతం పెరిగాయి.




Next Story