అగ్రశ్రేణి మల్టీప్లెక్స్ సంస్థలు ఒక్కటయ్యాయి
PVR, INOX announce merger. భారతదేశంలోని అగ్రశ్రేణి మల్టీప్లెక్స్ సంస్థలు PVR, INOX మార్చి 27న తమ విలీనాన్ని ప్రకటించాయి.
By Medi Samrat Published on 27 March 2022 7:17 PM ISTభారతదేశంలోని అగ్రశ్రేణి మల్టీప్లెక్స్ సంస్థలు PVR, INOX మార్చి 27న తమ విలీనాన్ని ప్రకటించాయి. PVR లిమిటెడ్, INOX లీజర్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డుల మధ్య సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నిర్ణయం గురించి ప్రకటించారు. INOX, PVR రెండింటికి సంబంధించి ఆల్-స్టాక్ సమ్మేళనాన్ని రెండు సంస్థలు ఆమోదించినట్లు తెలుస్తోంది. సంయుక్త సంస్థకు అజయ్ బిజిలీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. సంజీవ్ కుమార్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించాలని కూడా నిర్ణయించినట్లు పలు మీడియా సంస్థలు నివేదించాయి. INOX గ్రూప్ చైర్మన్ పవన్ కుమార్ జైన్ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. సిద్ధార్థ్ జైన్ సంయుక్త సంస్థలో నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమితులవుతారు.
రెండు మల్టీప్లెక్స్ సంస్థలు తమ వ్యాపారంలో గణనీయమైన పెరుగుదలను చూశారు. కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. గంగూబాయి కతియావాడి, ది కాశ్మీర్ ఫైల్స్, RRR వంటి కొత్త సినిమాల విడుదల కారణంగా థియేటర్లలో ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. మార్చిలో PVR భారీగా కలెక్షన్స్ వచ్చినట్లు నివేదించబడింది. "కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత నుండి మంచి సినిమాలు విడుదల కావడం ప్రారంభమైంది.. ప్రజలు ఇప్పుడు మళ్లీ సినిమాలకు వస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మార్చి మా ఉత్తమ నెలల్లో ఒకటిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మహమ్మారికి ముందు వచ్చిన జనం కంటే ఇప్పుడు మరింత మెరుగ్గా ఉంటుంది, "అని PVR లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజిలీ PTI కి చెప్పారు.