పార్లేజీ బిస్కెట్స్ ధరలు కూడా పెరగబోతున్నాయి

Parle Biscuits Price Hike. పెట్రోలు-డీజిల్ ధరల పెంపు ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ ఇతర వస్తువుల ధరలు

By Medi Samrat  Published on  24 Nov 2021 4:59 PM IST
పార్లేజీ బిస్కెట్స్ ధరలు కూడా పెరగబోతున్నాయి

పెట్రోలు-డీజిల్ ధరల పెంపు ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా సంక్షోభంలో ఉన్న సామాన్యులను ద్రవ్యోల్బణం దెబ్బతీస్తోంది. పార్లే-జీ కూడా బిస్కెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో కంపెనీ ఈ చర్య తీసుకుంది. పార్లే తన ఉత్పత్తి ధరను ఐదు నుంచి 10 శాతం వరకు పెంచాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని పార్లే కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. చక్కెర, గోధుమలు, నూనె వంటి ముడిసరుకు ధరలు భారీగా పెరిగాయని.. అందుకే బిస్కెట్ల ధరను పెంచాలని కంపెనీ నిర్ణయించిందని తెలిపారు.

పార్లే కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన గ్లూకోజ్ బిస్కెట్ ఇప్పుడు ఆరు నుండి ఏడు శాతం ఖరీదు అవ్వబోతున్నాయి. టోస్ట్ మరియు కేక్ వంటి వాటి ధరలను కూడా కంపెనీ వరుసగా ఐదు నుండి పది శాతం మరియు ఏడు నుండి ఎనిమిది శాతం వరకు పెంచింది. బిస్కట్‌లలో పార్లే-జి, హైడ్ & సీక్ మరియు క్రాక్‌జాక్ వంటి ప్రముఖ మైనవి ఉన్న సంగతి తెలిసిందే..! ఐదు నుంచి 10 శాతం వరకు ధరను పెంచామని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మయాంక్ షా తెలిపారు. రూ.20 కంటే ఎక్కువ విలువైన బిస్కెట్లు, ఇతర ఉత్పత్తుల ధరలను పెంచామని కంపెనీ తెలిపింది. మరికొన్ని బిస్కెట్ల ధరలు నిలకడగా ఉండేందుకు బిస్కెట్ ప్యాకెట్ బరువును తగ్గించింది.


Next Story